ఇంట్లో ఏ కూర వండుకున్నా.. అందులో ఒక టమాటా అయినా పడాల్సిందే. టమాటా ఉంటే ఆ రుచే వేరు అంటారు. టమాటాలతో ఎన్నో వెరైటీ వంటలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు వినియోగదారుడు టమాటా పేరు చెబితే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో రూ.100 నుంచి రూ.250 కి చేరింది.
దేశ వ్యాప్తంగా నెల రోజులుగా టమాటా ధరలు అస్సలు దిగిరావడం లేదు. రూ. 100 నుంచి రూ.250 వరకు రేటు పలుకుతుంది. దీంతో సామాన్యుడు మార్కెట్ లోకి వెళ్లి టమాటా కొనాలంటే భయపడిపోతున్నారు. ప్రజలపై టమాటా ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా పంటకు బాగా నష్టం వాటిల్లింది. దీంతో డిమాండ్ కి తగ్గ సరఫరా లేకపోవడంతో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధరల కన్నా కేజీ టమాటా ధరే ఎక్కువ ఉందని అంటున్నారు. కొన్నిచోట్లు ప్రజల ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాలు రైతు బజార్ కేంద్రాలో సబ్సిడీ ధరలకే అమ్ముతోంది. ఏది ఏమైనా మరో రెండు మాసాల వరకు టమాటా ధరలు ఇదే రేంజ్ లో కొనసాగవొచ్చు అని వ్యాపారులు అంటున్నారు. తాజాగా పేటీఎంలో టమాటలు అందుబాటులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
టమాట ధరలు చుక్కలనంటుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించిది. భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ (ఓఎన్‌డీసీ) ద్వారా టమాటాలు సగం ధరలకే అమ్ముతుంది. ఈ ఫ్లాట్ ఫామ్ లో ఉన్నటువంటి పేటీఎం, మ్యాజిక్ పిన్, మై స్టోర్, పిన్ కోడ్ యాప్స్ ద్వారా కిలో టమాటా రూ.70 అమ్మతున్నట్లు ఎన్‌సీసీఎఫ్ ప్రకటించింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో ఉన్న ప్రజలు ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో సబ్సిడీ కింద టమోటాలను ఆర్డర్ చేయవచ్చు. ఒక కస్టమర్ కి వారానికి రెండు కిలోలు మాత్రమే ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా కస్టమర్లకు కూడా టమాటాలు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టమాటాలు కావాల్సిన వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 నిమిసాల మధ్య ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అలా ఆర్డర్ చేసిన వారికి మరుసటి రోజు ఉచితంగా డెలివరీ చేస్తారు. ఈ విషయం గురించి ఎన్‌సీసీఎఫ్ ఎండీ అనిస్ జోసెఫ్ చంద్ర మాట్లాడుతూ.. ఇటీవల టమాటా ధరలు బాగా పెరిగిపోవడంతో వినియోదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌లో సబ్సిడీ రేటుకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నామని.. పేటీఎం, మ్యాజిక్‌పిన్, మైస్టోర్, పిన్‌కోడ్ ఆప్షన్స్‌లో ఒకదానిపై క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది.. ఫుడ్ పేజీలో కిలో టమాటా కేవలం రూ.70కే ఆర్డర్ చేయవచ్చన్నారు. ఒక్కసారి ఆర్డర్ కి 2 కిలోల వరకు మాత్రమే పరిమితం ఉంటుందని అన్నారు. కాగా, ఈ-కామర్స్ కంపెనీలు కిలోకు రూ.170-180 చొప్పున డోర్ సేఫ్ట్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే.