ఒకే ఒక పంట అన్నదమ్ముల ఇంట సిరులు కురిపించి.. లక్షాధికారులను చేసింది. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నందుకు.. వారి విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. ఇంతకు ఆ పంట ఏంటో అర్థమౌతుంది కదా.. అదే ఎర్ర బంగారం టమాటా.
ఒకే ఒక పంట అన్నదమ్ముల ఇంట సిరులు కురిపించి.. లక్షాధికారులను చేసింది. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నందుకు.. వారి విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. ఇంతకు ఆ పంట ఏంటో అర్థమౌతుంది కదా.. అదే ఎర్ర బంగారం టమాటా. సేద్యం చేయడం చిన్న చూపుగా చూస్తున్న నేటి యువతకు ఆద్శరంగా నిలిచేలా చేసింది ఈ పంట. ఇటీవల కాలంలో టమాటాలకు బాగా డిమాండ్ పెరగడంతో ధరలు ఉవ్వెత్తున ఎగసి పడిన సంగతి విదితమే. దీంతో టమాటా రైతు ఇంట కనక వర్షం కురిసింది. రైతు కూడా గ్రహించి ఉండడూ తన పంట బంగారం అవుతుందని. ఊహించని విధంగా రైతు కళ్లల్లో ఆనందాన్ని నింపింది. ఎన్నడూ లేని విధంగా టమాటాకు ఆశించిన స్థాయి కన్నా గిట్టుబాటు ధర ఎక్కువ పలకడమే కారణం.
ఈ సమయంలో టమాటా రైతులు లక్షలు, కోట్లు సంపాదించారు. అయితే వారంతా రైతులు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే యంగ్ స్టర్స్ చదువు మధ్యలో వదిలేసి సాగు వైపు మళ్లారు. టమాటా సాగు చేసి లక్షలు గడించడమే కాదూ అప్పులు తీర్చేశారు. ఆ యువ రైతులు ఎవరంటే.. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా లక్ష్మీపురకు చెందిన రాజేశ్, నాగేశ్ అనే అన్నదమ్ములు. మూడేళ్ల క్రితం చదువును మధ్యలో ఆపేసి.. తమకున్న రెండెకరాల పొలంలో సేద్యం చేయడం మొదలు పెట్టారు. అయితే టమాటా ధరకు గిరాకీ ఉందని భావించి.. తమ పొలం పక్కనే ఉన్న పదెకరాల భూమిని గత ఏడాది కౌలుకు తీసుకున్నారు.
మొత్తం 12 ఎకరాల్లో సాగు ప్రారంభించారు. దిగుబడి రావడంతో పాటు ధర ఎక్కువగా ఉండటం వారి కష్టానికి ప్రతిఫలం దక్కినట్లయింది. ఈ సీజన్ లో రెండు వేల టమాటా బాక్సులను అమ్మి.. సుమారు రూ. 40 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించారు. తమకు తల్లిదండ్రులు కూడా సాయం చేశారని చెబుతున్నారు ఈ కొడుకులు. టమాటా తోటలో దొంగలు పడుతున్న నేపథ్యంలో రాత్రుళ్లు పంటకు తన సోదరితో కలిసి వంతుల వారీగా కాపలా కాశారు. గతంలో ఉన్న అప్పులు కూడా ఇప్పుడు తీర్చినట్లు చెబుతున్నారు.