నిరుద్యోగులకు ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి మే 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా హెట్రో డ్రగ్స్, దక్కన్ ఫైన్ కెమికల్స్, అపోలో ఫార్మసీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 965 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. హెట్రో డ్రగ్స్, అపోలో ఫార్మసీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, పేటీఎం, సినాప్టిక్స్ ల్యాబ్స్, సినర్జీస్ కాస్టిండ్ లిమిటెడ్.. మొదలగు సంస్థల్లో ఈ భర్తీ చేపట్టనున్నారు. మొదట శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి కల్పిస్తారు. ఐదు నుంచి పది తరగతులు చదివిన వారు, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీ-ఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబిఏ పూర్తిచేసిన అభ్యర్థులు వీటికి అర్హులు. అర్హత, ఆసక్తి గల వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీరికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు: 965
ఖాళీల వివరాలు
విభాగాలు: మెషిన్ ఆపరేటర్, ప్రొడక్షన్ ఆపరేటర్, ఫార్మసిస్ట్, ట్రైనీ కెమిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్, హెల్పర్, ఫీల్డ్ టెక్నీషియన్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వంటి విభాగాల్లో ఈ భర్తీ చేపట్టనున్నారు.
విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, బీ-ఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబిఏ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.8,000 నుంచి రూ.25,000 వరకు వేతనం చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్.
దరఖాస్తులకు చివరి తేదీ: 19.05.2023
ఇంటర్వ్యూలు జరుగు తేదీ: 19.05.2023
ఇంటర్వ్యూలు జరుగు స్థలం:
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ తో రావాల్సి ఉంటుంది. రెజ్యుమ్ తో పాటు సంబంధిత విద్యార్హతల సర్టిఫికేట్ల కాపీలను వెంట తీసుకువెళ్ళాలి.
@AP_Skill has Conducting Job Mela at Government ITI College #Seethampeta #ManyamDistrict
Registration Link:https://t.co/b1fqHz8axm
Contact:
7032060773
6305110947
APSSDC Helpline – 9988853335 pic.twitter.com/HcUzLEZCpd— AP Skill Development (@AP_Skill) May 11, 2023