ఓ వైపు ఇంధన ధరలు.. మరో వైపు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనెటట్టు లేదు.. తినెటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇది చాలదన్నట్లు.. చమురు సంస్థలు సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ ధరలను భారీగా పెంచాయి. ఏకంగా 250 రూపాయలు పెంచాయి. అయితే ఇది డొమెస్టిక్ సిలిండర్ ధర కాదు.. కమర్షియల్ సిలిండర్ ధర.
ఇది కూడా చదవండి: బంపరాఫర్.. ఇలా చేస్తే అందరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!
చమురు సంస్థలు వాణిజ్య వినియోగ సిలిండర్ ధరను భారీగా పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా 273.50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరల తర్వాత హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర 2460కి చేరింది. గతంలో దీని ధర 2186 రూపాయలుగా ఉండేది. ఇక గృహ వినియోగానికి సంబంధించిన 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దాని ధర 1002 రూపాయల వద్ద నిలకడగా ఉంది.
ఇది కూడా చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 59 కే రోజంతా ప్రయాణం
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.