దేశంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని టీ20 ఫార్మాట్లతో పోలిస్తే.. ఐపీఎల్ కే క్రేజ్ ఎక్కువ అన్న సందర్భాలు కూడా అనేకం. దీనిని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమ్ వచ్చే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించేలా రూ.333, రూ.583, రూ.783 ప్లాన్‌లను పరిచయం చేసింది. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లలో లభిస్తాయి. జియో కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.
జియో రూ.333 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ప్రతిరోజు 1.5జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 42జీబీ డేటా వస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు మూడు నెలల పాటు డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
జియో రూ.583 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ప్రతిరోజు 1.5జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు మూడు నెలల పాటు డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
జియో రూ.783 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.
Jio Launch 4 New Recharge Plans
3 Months Disney+Hotstar#jio #Cricket #DisneyPlusHotstar #technogain pic.twitter.com/xSuyVS7W1B— Soumen Gain (@technogain17) May 4, 2022