డైలీ ఇంట్లో కూర్చుని చేసే పనా? రోజుకు రూ. 40 వేలు ఇస్తుందా? ఏడాదికి కోటిన్నర సంపాదించుకోవచ్చా? ఏంటా జాబు? ఏంటా కంపెనీ? అనే కదా మీ డౌటు. మరేం లేదండీ.. చాలా సింపుల్ జాబ్. రోజూ మామూలుగా, క్యాజువల్ గా చేసే పనే. వాళ్ళు అడిగింది డౌన్ లోడ్ చేయాలి అంతే. డౌన్ లోడ్ చేసి కంపెనీకి ఇవ్వాలి.
ఇప్పుడు చెప్పబోయే దాని గురించి మీరు షాక్ అవుతారు. కానీ ఇది నిజం. రక్తదానం, అవయవదానం, వీర్యదానం లాగా మలదానం అని ఒకటి కొత్తగా వచ్చిందిలెండి. అంటే మల విసర్జన చేసి ఆ మలాన్ని ఎవరైనా దానం చేస్తే వారికి ఒక కంపెనీ రోజుకు రూ. 41 వేలు చెల్లిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల మల శాంపిల్స్ ని సేకరించడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ వెల్లడించింది. మీరు గనుక రోజూ మల విసర్జన చేయగలిగితే ఏడాదికి దాదాపు కోటిన్నర సంపాదించుకోవచ్చునని కంపెనీ వెల్లడించింది. యూఎస్, కెనడా నుంచి పనిచేస్తున్న హ్యూమన్ మైక్రోబ్స్ అనే కంపెనీ రోజుకు 500 డాలర్లు అంటే 41 వేలు పైనే, ఏడాదికి 1,80,000 డాలర్లు అంటే 1.47 కోట్లు చెల్లిస్తుంది. కేవలం మల విసర్జన చేయడం ద్వారా ఏడాదికి కోటిన్నర సంపాదించుకోవచ్చు అంటండి.
ఆ డబ్బులు సరిపోకపోతే మీకు నచ్చిన ధరకు మీ మలాన్ని అమ్ముకోవచ్చునని కంపెనీ తన వెబ్ సైట్ లో వెల్లడించింది. మానవ సూక్ష్మజీవులను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ వెల్లడించింది. అయితే మలం ద్వారా డబ్బు సంపాదించాలంటే కంపెనీ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మల దానం చేసే దాతలకు కంపెనీ ముందుగానే డబ్బులు చెల్లిస్తుంది. ఆ తర్వాత దాతలు తమ మలాన్ని విలువైన కార్గో డ్రై ఐస్ షిప్పింగ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు మీ మలాన్ని దానం చేసినట్టు ఎవరికీ చెప్పరు. మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు. అయితే ఈ జాబ్ కి ఎంపిక అవ్వాలంటే కంపెనీకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు తగ్గట్టు ఉంటే మీకు ఈ అవకాశం లభిస్తుంది.
అసలు మలానికి వెలకట్టడం ఏంటండి.. మన దాన్ని తీసుకెళ్లి దానితో ఏం చేసుకుంటారు? అంటే మనిషి మలం ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని కంపెనీ చెబుతుంది. మలంలో ఉండే సూక్ష్మజీవులు ఒక మనిషి ప్రాణాలను కాపాడుతుందని హ్యూమన్ మైక్రోబ్స్ సంస్థ చెబుతోంది. మరి మీరు కూడా ఒక మనిషిని కాపాడాలి అనుకుంటే.. మీ మలం ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే గనుక కంపెనీని సంప్రదించండి. ఇంట్లో కూర్చుని చేసే పని అన్నప్పుడే అనుమానించాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్ అని అనుకోకండి. సీరియస్ గా ప్రయత్నిస్తే మీరు ఏడాదిలో కోటీశ్వరులు అవ్వచ్చు. మరి మలానికి వెలకట్టిన కంపెనీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి