కార్పొరేట్ ప్రపంచంలో ఒక కీలక విలీనానికి రంగం సిద్ధమైంది. అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మెర్జ్ కానుంది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన చేశారు. విలీనానికి ఇంకా సెబీ, సీసీఐ, ఆర్ బీఐ వంటి సంస్థల అనుమతి రావాల్సి ఉంది. ఈ నిర్ణయంతో అనుబంధ సంస్థలుగా ఉన్న హెచ్ డీఎఫ్ సీ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్‌లో విలీనం కానున్నాయి.
ఇదీ చదవండి: దేశంలో అత్యాచారాలకు ఫోన్లే కారణం.. మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు!
ఈ విలీనం తర్వాత మార్కెట్ విలువ ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మూడో అతిపెద్ద సంస్థగా అవతరించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ ఒకటి నాటికి క్యాపిటైలేజేషన్ పరిగణలోకి తీసుకుంటే విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.12.8 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ పరంగానూ హెచ్‌డీఎఫ్‌సీ అతిపెద్ద స్టాక్‌గా అవతరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఉన్న 11.9 శాతం వెయిటేజీని కూడా హెచ్‌డీఎఫ్‌సీ దాటేయనుందని భావిస్తున్నారు.ఈ విలీనం 2023- 24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం కల్లా పూర్తవుతుందని భావిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా అందనుంది. అలా చూసుకుంటే ప్రతి 25 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఉన్న వ్యక్తికి 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు లభించనున్నాయి. ఈ నిర్ణయంతో రెండు సంస్థల షేర్లు భారీ లాభాల్లోకి వచ్చాయి. తాజా విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పబ్లిక్ హోల్డర్స్ 100 శాతం భాగం కానున్నట్లు తెలుస్తోంది. హెజ్ డీఎఫ్ సీ వీలనం నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Housing Development Finance Corporation Limited (HDFC) will merge into HDFC Bank, reads the official document pic.twitter.com/Ky2Q9mXoas
— ANI (@ANI) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.