ప్రస్తుతం ప్రతి ఒక్కరి బ్యాంకుకు సంబంధించిన పనులు ఉంటున్నాయి. అందుకే చాలా మంది నిత్యం బ్యాంకులకు వెళ్తుంటారు. అలానే బ్యాంకులు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటాయి.
ప్రస్తుతం ప్రతి ఒక్కరి బ్యాంకుకు సంబంధించిన పనులు ఉంటున్నాయి. అందుకే చాలా మంది నిత్యం బ్యాంకులకు వెళ్తుంటారు. అలానే బ్యాంకులు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా దేశంలోని అతిపెద్ద ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన చేసింది. కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. మరి… ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఒకటి. తన కస్టమర్లను ఆకట్టుకునేలా అనేక సౌకర్యాలు కల్పిస్తూనే.. పలు కీలక నిర్ణాయాలు తీసుకుంటుంది. తాజాగా వినియోదారులకు శుభవార్త చెప్పింది. రూ. 2 నుంచి రూ.5 కోట్ల లోపు ఉండే బల్క్ ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 4.75 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లు కల్పిస్తోంది.
అలాగే సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీని అందిచనుంది. మరోవైపు.. ఏడాది నుంచి 15 నెలల టెన్యూర్ డిపాజిట్‌పై సీనియర్లకు గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీ ఇస్తుంది. అలానే రెగ్యులర్ కస్టమర్లకు 7.25 శాతం వడ్డీ కల్పించనుంది. సవరించిన వడ్డీ రేట్ల వివరాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. సవరించిన కొత్త వడ్డీ రేట్లు మే 27, 2023 నుంచే అమలులోకి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బల్క్ ఫిక్స్ డ్ డిపాజిట్ల రేట్లు వివరాలు ఇలా ఉన్నాయి. 7-29 రోజుల బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 4.75 శాతం, 30-45 రోజుల డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది.
అలానే 46-60 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీలపై 5.75 శాతం, 61-89 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 90-6 నెలల డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే ఏడాది నుంచి 15 నెలల డిపాజిట్లపై 7.25 శాతం, 15 నెలల నుంచి రెండేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీ రేట్లు ఇస్తోంది. అదే విధంగా 2- 10 ఏళ్లలోపు డిపాజిట్లపై 7 శాతం వడ్డీ కల్పిస్తోంది. మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు అదనగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు కల్పిస్తోంది. తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు పెంచిన వడ్డీరేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.