ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ప్రియులకు శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అందుకు మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ కాయిన్స్ ఉంటే చాలు.. కేవలం ఒకే ఒక్క రూపాయి చెల్లించి స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు..
ఫ్లిప్‌కార్ట్ లో షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికి సూపర్ కాయిన్స్ లభిస్తాయి. షాపింగ్ చేసిన మొత్తాన్ని బట్టి.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌తో పాటు నాన్ ప్లస్ మెంబర్స్‌కు కూడా ఈ కాయిన్స్ లభిస్తాయి. ఈ కాయిన్స్ ని రీడీమ్ చేసుకొని ఫ్లిప్‌కార్ట్ సూపర్‌కాయిన్ జోన్‌లో అనేక ఆఫర్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు అయితే.. ప్రతి రూ.100 కొనుగోలుపై 4 కాయిన్స్ వస్తాయి. గరిష్టంగా 100 కాయిన్స్ పొందవచ్చు. ఇక నాన్ ప్లస్ మెంబర్స్‌కు ప్రతి రూ.100 కొనుగోలుపై 2 కాయిన్స్ వస్తాయి. గరిష్టంగా 50 కాయిన్స్ పొందవచ్చు. సూపర్‌కాయిన్ జోన్‌లో ఈ కాయిన్స్ రీడీమ్ చేయొచ్చు. అనేక రివార్డ్స్, కూపన్స్ కూడా పొందొచ్చు. ఈ సూపర్ కాయిన్స్ సరైన టైం కి ఉపయోగించకపోతే ఎక్స్‌పైరీ అవుతుంటాయి.ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ సూపర్ కాయిన్స్‌తో వస్తువులు కూడా కొనొచ్చు. కొన్ని ప్రొడక్ట్స్‌ని కేవలం ఒక్క రూపాయి చెల్లించి కొనొచ్చు. మిగతా మొత్తాన్ని సూపర్ కాయిన్స్ ద్వారా చెల్లించే అవకాశం కల్పిస్తుంది ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ ఇపుడు ఓ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక్క రూపాయికి కొనే అవకాశం కల్పిస్తోంది. కేవలం ఒక రూపాయిమాత్రమే చెల్లించి.. మిగతా మొత్తాన్ని కాయిన్స్ రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తోంది. ఒప్పో ఇండియా గతవారం రిలీజ్ చేసిన ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఈ ఆఫర్ ఉంది. ఒప్పో రెనో 7 ప్రో సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది.
ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999. కాగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు కేవలం రూ.1 చెల్లించి మిగతా 38999 రూపాయలను సూపర్ కాయిన్స్ రూపంలో చెల్లించి.. ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎప్పటివరకు ఉంటుందన్న విషయాన్ని సంస్థ ప్రకటించలేదు. ఇప్పటివరకు భారీగా సూపర్ కాయిన్స్ పొందినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
OPPO Reno 7 Pro review: One step forward, two steps back https://t.co/ZKW5ir37hU pic.twitter.com/eOZdnpnJGM
— andy suryadi (@andysuryadi44) February 15, 2022