స్మార్ట్ వాచెస్ ని ఇప్పుడు బాగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే పెరిగిన డిమాండ్ కి తగ్గట్లు కంపెనీలు కూడా స్మార్ట్ వాచెస్ ని తయారు చేస్తున్నారు. అద్భుతమైన ఫీచర్స తో అతి తక్కువ ధరలతో ఈ స్మార్ట్ వాచెస్ మార్కెట్ లో రిలీజ్ అవుతున్నాయి. అలాంటి ఒక స్మార్ట్ వాచ్ ఇప్పుడు మార్కెట్ లో రిలీజ్ అయ్యింది.
స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ పెరిగిన విధంగానే తయారీ కూడా అలాగే పెరిగింది. చాలా కంపెనీలు ఇప్పుడు స్మార్ట్ వాచెస్ ని తయారు చేస్తున్నాయి. అందుకే స్మార్ట్ వాచ్ ల ధరలు కూడా అలాగే తగ్గుతున్నాయి. కనీసం వారానికి ఒక కొత్త బ్రాండ్ స్మార్ట్ వాచ్ అయినా మార్కెట్ లోకి విడుదల అవుతోంది. తాజాగా గిజ్ మోర్ కంపెనీ నుంచి ఒక స్టైలిష్ స్మార్ట్ వాచ్ లాంఛ్ అయింది. పైగా దాని ధర చూస్తే దిగువ మధ్యతరగతి వాళ్లు కూడా కొనుగోలు చేసే రేంజ్ లోనే ఉంది. దాని ఎమ్మార్పీ రూ.5,999 కాగా లాంఛింగ్ ఆఫర్ కింద 81 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,099కే అందిస్తున్నారు. మరి.. ఈ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయచ్చా? లేదా? తెలుసుకుందాం.
గిజ్ మోర్ కంపెనీ పేరు ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. వీళ్లు ఇప్పటికే పలు బడ్జెట్ స్మార్ట్ వాచెస్ ని లాంఛ్ చేశారు. ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన గిజ్ మోర్ ఫ్లాష్ అనే స్మార్ట్ వాచ్ ని కేవలం రూ.1,099కే అందిస్తున్నారు. ఈ వాచ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 1.85 ఆల్వేస్ ఆన్ డిస్ ప్లేతో వస్తోంది. ఈ ప్రైస్ రేంజ్ లో 1.85 ఇంచెస్ డిస్ ప్లే అంటే బెస్ట్ అనే చెప్పాలి. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. దీని కంటే ధర ఎక్కువున్న చాలా స్మార్ట్ వాచెస్ ఇదే బ్రైట్ నెస్ తో వస్తున్నాయి. ఇందులో వాయిస్ కంట్రోల్ ఉంది. అలెక్సా, సిరి అంటూ మీరు కాల్స్ చేయచ్చు, రిమైండర్స్ సెట్ చేయమని చెప్పచ్చు. ఈ ధరలో వాయిస్ అసిస్టెన్స్ రావడం కాస్త కష్టమనే చెప్పాలి.
ఇంక ఈ వాచ్ బ్యాటరీ గురించి చెప్పుకోవాలి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 15 రోజుల వరకు మీరు ఈ స్మార్ట్ వాచ్ ని వాడుకోవచ్చు. అలాగే బ్లూటూత్ కాలింగ్ తో అయితే మూడ్రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇందులో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇంక సెన్సార్స్ చూస్తే.. బ్లడ్ ఆక్సిజన్, 24 గంటల హార్ట్ రేట్ మోనిటరింగ్, హైడ్రేషన్ అలర్ట్, కేలరీ బర్న్ ట్రాకర్, లేడిస్ కోసం పిరియడ్ ట్రాకర్, బ్రీతింగ్ గైడ్, స్లీప్ మానిటర్ అంటూ చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో 3 ఇన్ బిల్ట్ గేమ్స్ ఉన్నాయి. వీళ్లు ఇస్తున్న ఫీచర్స్ కి, పెట్టిన ధరకు అస్సలు పొంతన లేదనే చెప్పాలి. ఇన్ని ఫీచర్స్ తో కేవలం రూ.1,099కే అంటే కచ్చితంగా కొనుగోలు చేయచ్చు. ఈ గిజ్ మోర్ ఫ్లాష్ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.