తక్కువ ధరలో మంచి కాన్ఫిగరేషన్, మంచి స్పెసిఫికేషన్స్ తో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం. 80 వేల రూపాయలు విలువైన ల్యాప్ టాప్ ను మీరు ఆన్ లైన్ లో కేవలం 32 వేల రూపాయలకే పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ల్యాప్ టాప్ డైరెక్ట్ గా రూ. 50 వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్ టాప్ అయితే బాగుంటుందని భావిస్తున్నారా? చదువుకునేవారికి, ఆ తర్వాత జాబ్ చేసేవారికి, కొంచెం హెవీ వర్క్స్ అంటే వీడియో ఎడిటింగ్, ఫోటో షాప్ లాంటి కొంచెం పెద్ద సాఫ్ట్ వేర్లు వాడినా గానీ తట్టుకునే సామర్థ్యం ఉన్న ల్యాప్ టాప్ కొనాలని భావిస్తున్నారా? అన్నిటికంటే మించి తక్కువ ధరలో దొరికితే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అయితే ఈ ల్యాప్ టాప్ మీ కోసమే. రూ. 82 వేలు, రూ. 74 వేలు ఉన్న ల్యాప్ టాప్ లను సగం కంటే తక్కువ ధరకే అమ్ముతున్నారు. నోకియా కంపెనీ తీసుకొచ్చిన రెండు ల్యాప్ టాప్ మోడల్స్ ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్ సైట్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. నోకియా ప్యూర్ బుక్ ఎస్ 14 మోడల్స్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది.
దీని మోడల్ వచ్చేసి NKi511TL85S థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్. డిస్ప్లే సైజు 14 అంగుళాలు, ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది. ఎస్ 14 ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో మొత్తం 4 కోర్స్ ఉంటాయి. ఇది 8 జీబీ DDR4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్, విండోస్ 11 హోమ్ ఎడిషన్ తో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తోంది. నలుపు రంగులో వస్తున్న ఈ ల్యాప్ టాప్ 1.4 కిలో గ్రాముల బరువు ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ మీద ఏడాది వారంటీ కూడా వస్తోంది. దీని బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు వస్తుంది. 57W పవర్ అడాప్టర్ తో వస్తోంది. ఒక యూఎస్బీ పోర్టు, టైప్ సి పోర్టు (మొబైల్ డేటా కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి), ఒక HDMI పోర్టు, మల్టీ కార్డు స్లాట్ తో వస్తోంది. స్క్రీన్ రిజల్యూషన్ 1920×1080 పిక్సెల్ తో వస్తోంది. దీని ధర ఆన్ లైన్ లో రూ. 82,990 ఉండగా రూ. 50 వేల తగ్గింపుతో కేవలం రూ. 32,990 లకే లభిస్తోంది. ట్రెండింగ్ లో ఉండడంతో త్వరగా అమ్ముడైపోతున్నాయి. ఒకవేళ అందుబాటులో లేకపోతే గనుక నోటిఫై ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ల్యాప్ టాప్ లు అందుబాటులోకి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
దీని మోడల్ వచ్చేసి NKi510TL85S థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్. డిస్ప్లే సైజు 14 అంగుళాలు, ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది. ఎస్ 14 ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో మొత్తం 4 కోర్స్ ఉంటాయి. ఇది 8 జీబీ DDR4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తోంది. హోమ్ ఎడిషన్ తో 64 బిట్ ఆర్కిటెక్చర్ కలిగి ఉంది. నలుపు రంగులో వస్తున్న ఈ ల్యాప్ టాప్ 1.4 కిలో గ్రాముల బరువు ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ మీద ఏడాది వారంటీ కూడా వస్తోంది. దీని బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు వస్తుంది. 57W పవర్ అడాప్టర్ తో వస్తోంది. ఒక యూఎస్బీ పోర్టు, టైప్ సి పోర్టు (మొబైల్ డేటా కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి), ఒక HDMI పోర్టు, మల్టీ కార్డు స్లాట్ తో వస్తోంది. స్క్రీన్ రిజల్యూషన్ 1366×768 పిక్సెల్ తో వస్తోంది. దీని ధర ఆన్ లైన్ లో రూ. 74,990 ఉండగా రూ. 43 వేల తగ్గింపుతో కేవలం రూ. 31,990 లకే లభిస్తోంది.
మీ దగ్గర పాత ల్యాప్ టాప్ ఉంటే గనుక రూ. 20 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో వస్తోంది. కాబట్టి 11th జనరేషన్ ల్యాప్ టాప్ ను రూ. 12,990కే పొందవచ్చు. కనీసం రూ. 8 వేలు వచ్చినా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో రూ. 24,990కే పొందవచ్చు. ఇక 10th జనరేషన్ ల్యాప్ టాప్ అయితే రూ. 20 వేల ఎక్స్ఛేంజ్ లభిస్తే రూ. 11,990 కే పొందవచ్చు. కనీసం రూ. 8 వేలు వచ్చినా రూ. 23,990కే పొందవచ్చు. అలానే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద రూ. 1500 వరకూ తగ్గింపు వస్తుంది. యూపీఐ లావాదేవీల ద్వారా కొంటే గనుక రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ. 12 వేల తగ్గింపు కూడా ఇస్తుంది. ఈ ల్యాప్ టాప్ ల మీద ఏడాది వారంటీ వస్తోంది. 11th జనరేషన్, 10th జనరేషన్ ల్యాప్ టాప్ లకు ఆల్మోస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉన్నాయి. స్క్రీన్ రిజల్యూషన్, ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే తేడా. మిగతావన్నీ ఒకటే. సర్వీసింగ్ సెంటర్స్ లేవు. కానీ నోకియా వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకుంటే.. ఇంటికి వచ్చి సర్వీసింగ్ చేస్తారు. ఇదొకటి బెనిఫిట్ అని చెప్పవచ్చు. మరి ఇంత తక్కువ ధరకే నోకియా ల్యాప్ టాప్ లు రావడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.