పలు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్ల మీద తగ్గింపుని ఇస్తుంటాయి. వీటితో పాటు పలు బ్యాంకులు కూడా తమ డెబిట్, క్రెడిట్ కార్డుల మీద ఆఫర్లు ఇస్తుంటాయి. ఇవి కాకుండా పలు ఈ కామర్స్ వెబ్ సైట్లు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో ఫోన్ మీద భారీ తగ్గింపును ఇస్తుంటాయి. ఈ క్రమంలో 20 వేల రూపాయల విలువైన ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ మీద భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. ఆఫర్ల మీద ఫోన్ కొంటే గనుక రూ. 950కే 5జీ స్మార్ట్ ఫోన్ లభించే అవకాశం ఉంది.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో ఏ సిరీస్ కు సంబంధించి మరో 5జీ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ78ను ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బడ్జెట్ ధరకే అందించేలా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసింది. తొలుత ఈ ఫోన్ ధరను రూ. 21,999 గా కంపెనీ నిర్ణయించింది. ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ లో దీని మీద రూ. 3 వేల డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అంటే రూ. 18,999లకి ఈ ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. 14 శాతం డిస్కౌంట్ తో రూ. 21,999 విలువ గల స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 18,999కే లభిస్తుంది. అయితే దీన్ని ఆఫర్ల మీద రూ. 950 కే పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఎలాంటి ఆఫర్లు లేకుండా ఫోను కొనుగోలు చేస్తే కేవలం రూ. 3 వేలు తగ్గింపు లభిస్తుంది. అదే ఆఫర్లను అప్లై చేయడం ద్వారా ఈ ఫోన్ మీద రూ. 18,049 వరకూ తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ మీద మూడు ఆఫర్లు ఉన్నాయి. బ్యాంకు ఆఫర్లు, పార్టనర్ ఆఫర్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ నడుస్తున్నారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, వంటి తొమ్మిది బ్యాంకు క్రెడిట్ కార్డుల మీద రూ. 250 నుంచి రూ. 1500 వరకూ తగ్గింపు లభిస్తుంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఛేంజ్ పై పార్టనర్ ఆఫర్ కింద రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లను వాడుకుంటూ వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ పాత ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ చేస్తే ఒప్పో ఏ78 స్మార్ట్ ఫోన్ మీద గరిష్టంగా రూ. 18,049 వరకూ తగ్గింపు లభిస్తుంది. అదే మీకు క్రెడిట్ కార్డులు లేకపోయినా, ఆఫర్లను వాడుకోకపోతే ఎక్స్ ఛేంజ్ లో రూ. 17,850 వరకూ తగ్గింపుతో లభిస్తుంది.
ఈ విధంగా మీరు మీ పాత ఫోన్ ఇచ్చేసి కొత్త ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే రూ. 950కే వస్తుంది. ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 33 వాట్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది. 6.5 అంగుళాల డిస్ప్లే తో వస్తున్న ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 2 మెగాపిక్సెల్ క్రిస్టల్ క్లియర్ కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ర్యామ్ స్టోరేజ్ ని మరో 8 జీబీ పెంచుకునేలా.. అలానే స్టోరేజ్ స్పేస్ ని 1 టీబీ వరకూ ఎక్స్ పాండ్ చేసుకునే ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఒప్పో ఏ78 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి