దేశంలో గత కొన్ని రోజులుగా 2వేల రూపాయల నోట్లు చలామణీలో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం 2వేల రూపాయల నోట్లను రద్దు చేయబోతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఈ విషయాన్ని ప్రజలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక.. నల్లధనాన్ని నిరోధించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టింది. క్రమంగా రూ.500, రూ.200 కొత్త నోట్లను కూడా చలామణీలోకి తెచ్చింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2వేల నోటును క్రమక్రమంగా చలామణీలోంచి వెనక్కి తీసుకునేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వీటి ముద్రణ ఆపేసిన కేంద్ర బ్యాంకు.. నోట్ల చలామణిని కూడా తగ్గిస్తూ వస్తోంది. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీలో ఉండగా.. 2021 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 245 కోట్లకు తగ్గింది. ఇక.. ఈ ఏడాది మార్చి నాటికి వీటి సంఖ్య 214 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2021 మార్చిలో అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం 2 శాతం కాగా.. ఈ ఏడాది మార్చి నాటికి అది 1.6 శాతం తగ్గినట్లు తెలిపింది. అలాగే, మొత్తం కరెన్సీ విలువలో రూ.2వేల నోట్లు విలువ 17.3శాతం నుంచి 13.8శాతానికి తగ్గినట్లు పేర్కొంది.
Is RBI printing less 2000 rupee notes or is it much easier to hide than old notes?
Whatever, Demonetisation was a gimmick and abominable ploy to divert people from the big picture. pic.twitter.com/11QTjJR1WG— Rishav Kumar (@RishavKumarPat3) May 27, 2022
ఇక ఇదే సమయంలో రూ.500 నోట్ల చలామణి మాత్రం విపరీతంగా పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2021 మార్చి నాటికి 3,867.90 కోట్ల రూ.500 నోట్లు చలామణిలో ఉండగా.. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ సంఖ్య ఏకంగా రూ.4,554.68 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణమే (34 9శాతం).
ఇది కూడా చదవండి: మిడిల్ క్లాస్ వాళ్లకు శుభవార్త! 10 వేల EMIతో 30 లక్షలు విలువచేసే ఇల్లు కొనొచ్చు!
సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వార్తాసంస్థ ఆర్బీఐని 2,000 రూపాయల నోట్ల గురించి అడగటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2019 – 2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్బీఐ ఒక్క 2,000 రూపాయల నోటును కూడా ముద్రించలేదు. దీంతో ఈ నోట్లు రద్దు కాబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఏదేమైనప్పటికీ నోట్లు.. ఎన్ని ముద్రించాలి? ఎన్ని చలామణిలో ఉంచాలి?.. అన్నది ఆర్బీఐ నిర్ణయం కనుక ఈ వార్తలు నిజం కాదు అన్నది కొందరి అభిప్రాయం. మరి.. 2,000 రూపాయల నోట్ల రద్దు వార్తలు నిజమా? కాదా? అనే విషయంపై నుండి సమాధానం రావాల్సి ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.