ప్రస్తుతం మన దేశంలో 22 క్యారెట్ బంగారం తులం ధర ఏకంగా 50 వేల రూపాయల పై చిలుకు ఉంది. అలానే 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు ఏకంగా 56 వేల రూపాయలకు పైగా ఉంది. ఈ క్రమంలో తులం బంగారం కేవలం 37 వేల రూపాయలు మాత్రమే అంటే.. ఇంకేముంది పసిడి ప్రియులు ఎగబడతారు. మరి ఈ ఆఫర్ ఎక్కడ అంటే..
భారతీయులకు బంగారం అంటే.. కేవలం ఆభరణం మాత్రమే కాదు. పసిడితో మనకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వేల ఏళ్ల నాటి నుంచి భారతీయుల అలంకరణలో బంగారు ఆభరణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక నేటి కాలంలో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే బంగారం ధర కూడా చుక్కలను తాకుతుంది. అయినా సరే.. పసిడి ప్రియులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అయితే మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్.. ఉన్నప్పటికి ఉత్పత్తి చాలా తక్కువ. మనం వాడే బంగారంలో 90 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నాం. 2022 ఏడాదిలో విదేశాల నుంచి దాదాపు 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది ఇండియా. బంగారం కోసం గత ఏడాది భారతీయులు ఏకంగా 36.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారంటే.. మన దగ్గర పసిడి కొనుగోళ్లు ఎంత భారీగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భారతీయులకు పసిడి మీద ఉన్న మోజును అర్థం చేసుకున్న మన పొరుగు దేశం ఒకటి.. కేవలం 37 వేల రూపాయలకే తులం బంగారం అమ్మడానికి ముందుకు వచ్చింది. ఇంతకు ఆ దేశం ఏది.. ఎందుకు అంటే..
మన పొరుగు దేశం భూటాన్.. భారతీయులకు ఈ భారీ బంపర్ ఆఫర్ ప్రకిటంచింది. ఫుయంషోలింగ్, థింపులకు వచ్చే భారతీయులు ఎలాంటి ట్యాక్స్ లేకుండానే బంగారం కొనుగోలు చేసేందుకు భూటాన్ ప్రభుత్వం అనుమతిస్తోంది. అంటే ఇండియాలో కన్నా తక్కువ ధరకే అక్కడ బంగారం కొనుగోలు చేయొచ్చు. భారతీయులు తమ దేశంలో ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఫిబ్రవరి 21, 2023 రోజునే భూటాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 21కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజున భూటాన్ కొత్త ఏడాది, భూటాన్ రాజు పుట్టినరోజు కూడా.
ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని భూటాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈ ఆఫర్ ఎందుకు ప్రకటించింది అంటే.. తమ దేశ టూరిజాన్ని ప్రమోట్ చేసుకుని.. ఆదాయం పొందేందుకు భూటాన్ ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ పేర్కొంది. ప్రస్తుతం చాలా మంది భారతీయులు దుబాయ్ వెళ్లి బంగారం కొంటున్నారు. భారత్‌తో పోలిస్తే అక్కడ ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో భూటాన్ కూడా తాజాగా ఈ భారీ ఆఫర్ ప్రకటించింది.
ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం భారత్‌లో 24 క్యారెట్ బంగారం తులం ధర ఏకంగా రూ.55,600పైన ఉంది. అయితే భూటాన్‌లో భూటనీస్ ఎన్‌గూల్ట్రమ్ (బీటీఎన్) ప్రకారం 10 గ్రాములకు బీటీఎన్ 37,588.49గా ఉంది. ఒక భూటాన్ కరెన్సీ బీటీఎన్ ఇండియన్ రూపాయితో సమానంగా ఉంది. అంటే భారతీయులు ఈ ఆఫర్‌తో 10 గ్రాముల బంగారాన్ని కేవలం రూ.37,588కే కొనుగోలు చేయవచ్చు
అయితే భారతీయులు భూటాన్ ప్రకటించిన ఈ పన్ను రహిత బంగారం కొనుగోలు చేయాలంటే.. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫీ (ఎస్‌డీఎఫ్) కింద రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే భూటాన్ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సర్టిఫైడ్ హోటల్‌లో ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది. భూటాన్ ఈ ఎస్‌డీఎఫ్ టూరిజం ట్యాక్స్‌ను 2022లోనే అమల్లోకి తీసుకువచ్చింది. భారతీయులు ఒక వ్యక్తి ఒక రోజుకు రూ.1,200 నుంచి రూ.1,800 ట్యాక్స్ చెల్లించాలి. ఇతర దేశస్థులు 65 నుంచి 200 డాలర్ల వరకు కట్టాలి. ఈ ఎస్‌డీఎఫ్ టూరిజం ట్యాక్స్ కట్టిన వారు మాత్రమే ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనేందుకు అర్హులవుతారు. ఈ బంగారాన్ని డ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ సాధారణంగా లగ్జరీ వస్తువులు విక్రయిస్తుంటారు. అవి భూటాన్ ఆర్థిక శాఖ నేతృత్వంలోనే పని చేస్తుంటాయి.
మరి భూటాన్ ప్రకటించిన ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ ఆఫర్‌లో భాగంగా భారతీయులు ఆ దేశంలో ఎంత బంగారం కొనుగోలు చేయవచ్చు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం నిబంధనల ప్రకారం భూటాన్ నుంచి ఒక భారతీయుడు రూ.50 వేల విలువైన బంగారం.. అలానే భారతీయ మహిళ అయితే రూ.1 లక్ష ఖరీదు చేసే బంగారం తీసుకురావచ్చు. అంతకు మించి బంగారం కొనుగోలు చేసి.. ఇండియా తీసుకువస్తే కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. మరి భూటాన్ ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In a bid to boost tourism Indian and other SDF fee paying tourists coming to Phuentsholing or Thimphu in Bhutan can now buy tax free gold.
The only condition being you have to stay in a tourist certified hotel and pay SDF.
The gold will be much more cheaper than in India.
— Tenzing Lamsang (@TenzingLamsang) February 24, 2023