ప్రస్తుతం అదానీ గ్రూప్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అదానీపై స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అదానీకి సహాయం చేసేందుకు ఓ ప్రభుత్వ బ్యాంకు ముందుకొచ్చింది. అదానీ పరిస్థితి తెలిసే లోన్ ఇస్తామని ప్రకటించింది.
ఎవరైనా కష్టాల్లో ఉంటే ఏ బ్యాంకు కూడా ముందుకొచ్చి లోన్ ఇవ్వదు. ఆర్థికంగా బాగుంటేనే గానీ రుణాలు ఇవ్వరు ఏ బ్యాంకు వాళ్ళు. అయితే వ్యాపారవేత్తల విషయంలో బ్యాంకులు భిన్నంగా వ్యవహరిస్తాయి. కానీ ఓ ప్రభుత్వ బ్యాంకు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ తో ఒక్కసారిగా పడిపోయిన అదానీ స్టాక్స్ ని చూసి అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అదానీని నమ్మే పరిస్థితి ఎవరికీ లేదు. ఒకసారి లోన్ ఇచ్చిన వ్యక్తికి గానీ, సంస్థకు గానీ ఆ సంస్థ లేదా వ్యక్తి ఆర్థికంగా నష్టపోతే మరోసారి లోన్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ అదానీకి మద్దతుగా ఒక ప్రభుత్వ బ్యాంకు ముందుకొచ్చింది.
ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా అదానీ గ్రూప్ కు లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీకి లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కీలక ప్రకటన చేసింది. అదానీ సంస్థకు అదనంగా లోన్ ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా సిద్ధంగా ఉందని తెలిపింది. కష్టాల్లో ఉన్న అదానీ గ్రూప్ కి ఋణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముంబై మురికివాడ ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అదానీ గ్రూప్ కి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు లోన్ ఇస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ సంజీవ్ చద్దా వెల్లడించారు. అదానీ గ్రూప్ కనుక పూచీకత్తు ప్రమాణాలు పాటిస్తే లోన్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
అదానీ స్టాక్స్ విషయంలో నెలకొన్న మార్కెట్ అస్థిరత పట్ల తమకు ఎలాంటి ఆందోళన లేదని వెల్లడించారు. ఇటీవల అదానీ గ్రూప్ 500 మిలియన్ డాలర్ల రుణాలను రీఫైనాన్సింగ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంకులు అడ్డు చెబుతుండగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో అదానీ గ్రూప్ కి లోన్ ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా మళ్ళీ అదనంగా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే అదానీ గ్రూప్ కి ఎంత ఋణం ఇచ్చారో అనే విషయాన్ని బ్యాంకు వారు వెల్లడించలేదు. దీనికి సమాధానంగా.. వారి అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లోనూ మద్దతుగా నిలవాలని అన్నారు. మరి అదానీ గ్రూప్ కి లోన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్న ప్రభుత్వ బ్యాంకుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.