వినడానికి ఇది పిల్లల పాటే అయినా అందరిని ఆకట్టుకుంటోంది. బేబీ షార్క్ అనే ఈ వీడియో సాంగ్‌ను నిరంతరయంగా ఏళ్ల పాటు 30,187 స్ట్రీమింగ్ అవుతోంది. 7 బిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించి షేక్ చేస్తోంది. ఈ పాట పాతదే అయినప్పటికీ యూట్యూబ్ వీక్షకుల్లో ఎంతో మందిని అలరిస్తోంది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోగా లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీకి చెందిన ‘డెస్పాసిటో’ ఉంది. ఆ రికార్డును ఈ చిన్నారుల పాట అధిగమించింది. పిల్లలతో పాటు, పెద్దలనూ ఇంతగా అలరించిన ఈ పాటను 2016 జూన్ లో మొదటగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇది సియోల్‌కు చెందిన నిర్మాణ సంస్థ పింక్‌ఫాంగ్ చేత రూపొందించబడిన అమెరికన్ క్యాంప్‌ఫైర్ పాట యొక్క రీమిక్స్. ఈ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించడంతో గ్లోబల్ మ్యూజిక్ చార్ట్ లోనూ స్థానం సంపాధించుకుంది.
2019 జనవరిలో బిల్బోర్డ్ హాట్ 100లో 32వ స్థానం దక్కించుకుని ఆ సమయంలో రికార్డు పొందింది. యూట్యూబ్ స్ట్రీమింగ్‌లో పింక్ ఫాంగ్ ఒకటి మాత్రమే 5.2 మిలియన్ డాలర్లు (4మిలియన్ ఫౌండ్లు)తో రికార్డు సృష్టించింది. ఈ పాట యూట్యూబ్ టాప్ మోస్ట్ ప్లేయిడ్ చార్టులో చేరడానికి నాలుగు ఏళ్లు సమయం పట్టింది. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ పాటకు ఫిదా అయ్యారు.
వినసొంపుగా ఉండే పాట అందరి అభిమానాలను అందుకుంది. వాషింగ్టన్ నేషనల్స్ బేస్ బాల్ టీమ్ ఈ పాటను తమ ఆంథెంగా ఎంచుకోవడం విశేషం. అనంతరం వరల్డ్ సిరీస్ లో విజయం సాధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో వైట్ హౌస్ లోనూ ఈ పాటను ప్లే చేయడం మరో ముచ్చట.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఈ పాటను చిన్నారులకు అవగాహన కల్పించేందుకు అనుగుణంగా మార్చారు. ‘వాష్ యువర్ హాండ్స్’ అంటూ ఈ పాటకు మరో వర్షన్ విడుదల చేసి తద్వారా చిన్నారుల్లో పరిశుభ్రత పెంచేలా ప్రోత్సహించారు.
ఆ వీడియో మీరూ వీక్షించండి: