యూట్యూబ్‌లో బ్యాంకాంక్ పిల్లకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పెట్టిన వీడియోలకు రోజులోనే మిలియన్ వ్యూస్ వస్తున్న సందర్భాలు ఉన్నాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని టాలెంట్ ఉన్న వారికి మంచి రోజులు వచ్చేశాయి. తమలో ఉన్న కళను బయటపెట్టి సోషల్ మీడియా ద్వారా నెలకు లక్షలు సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా అందరికీ నచ్చేలా.. నాలుగు మాటలు మాట్లాడేవారు కూడా బాగా సంపాదిస్తున్నారు. యూట్యూబ్ స్టార్స్‌గా పేరు బడ్డ వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వ్లాగ్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ‘బ్యాంకాక్ పిల్ల’ ఒకరు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రావణి గత కొన్నేళ్లుగా బ్యాంకాక్‌లో ఉంటున్నారు. బ్యాంకాక్‌కు సంబంధించిన వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు.
ఆమె 2022 జనవరి నెలలో ‘‘బ్యాంకాక్ పిల్ల’’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను మొదలు పెట్టారు. తక్కువ కాలంలోనే దాదాపు 20 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ను పొందారు. సోషల్ మీడియా వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయారు. ఆమె వీడియోలకు లక్షలు, మిలియన్లలో వ్యూస్ వస్తూ ఉన్నాయి. గతంలో ఆమె తన మొదటి నెల యూట్యూబ్ సంపాదన గురించి ఓ వీడియో చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే రెండో నెల యూట్యూబ్ సంపాదన గురించిన కూడా చెప్పమని ఆమె అభిమానులు కోరారు. దీంతో ఆమె తన రెండో నెల యూట్యూబ్ సంపాదన గురించి కూడా ఓ ప్రత్యేకమైన వీడియో చేసింది.
ఆ వీడియోలో తన సంపాదన గురించిన పూర్తి వివరాలు వెల్లడించింది. ఆమె రెండో నెలకు గానూ దాదాపు 2 వేలకు పైగా డాలర్లను సంపాదించింది. దీన్ని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే.. రూ. 2 లక్షలకుపైగా అవుతుంది. ఆమె వ్లాగ్స్ చేస్తూ నెలకు 2 లక్షల రూపాయలకు పైగా సంపాదించటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించగలమనటానికి బ్యాంకాక్ పిల్ల ఓ నిదర్శనంగా నిలుస్తోంది. మరి, బ్యాంకాక్ పిల్ల రెండో నెల సంపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.