బ్యాంకు ఖాతాదారులారా.. మీ కోసమే ఈ వార్త. ఎందుకంటే రానున్న 9 రోజుల్లో.. 5 రోజులు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య బ్యాంకులు నాలుగు రోజులే పని చేస్తాయి. మార్చి 26న నాలుగో శనివారం సాధారణ సెలవు, మార్చి 27న ఆదివారం సాధారణ సెలవు. ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు మార్చి 28-29 తేదీలలో రెండు రోజుల సమ్మెను ప్రకటించాయి. దీంతో 4 రోజుల పాటు వరుసగా బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు వర్కింగ్ లో ఉన్నా.. ఏప్రిల్ 1, 2 తేదీల్లో బ్యాంకుల వార్షిక సంవత్సర కారణంగా లావాదేవీలు అంతంతమాత్రమే. ఏప్రిల్ 3న ఆదివారం కావడంతో మరో రోజు బ్యాంకు మూతపడనుంది. ఫలితంగా రానున్న 9 రోజుల్లో 2 రోజులు మాత్రమే పూర్తిస్థాయిలో లావాదేవీలు జరగనున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈ సమ్మె జరుగుతోంది. బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021ని వెనక్కి తీసుకోవడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణను ఆపడం, మొండి బకాయిల్ని రికవరీ చేయడం, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం, కస్టమర్లపై భారీ సర్వీస్ ఛార్జీలు తొలగించడం, ఐదు రోజుల పనిదినాలు, చైల్డ్ కేర్ లీవ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను తొలగించడం, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయడం, డియర్‌నెస్ అలవెన్స్‌లో క్రమరాహిత్యాన్ని తొలగించడం లాంటి ఉన్నాయి.
ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవంటే?
మార్చి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు
మార్చి 27: ఆదివారం సాధారణ సెలవు
మార్చి 28: ఉద్యోగుల సమ్మె
మార్చి 29: ఉద్యోగుల సమ్మె
మార్చి 30: వర్కింగ్
మార్చి 31: వర్కింగ్
ఏప్రిల్ 1: వర్కింగ్(వార్షిక సంవత్సర ముగింపు)
ఏప్రిల్ 2: వర్కింగ్ (కొత్త సంవత్సర స్టార్టింగ్ డే)
ఏప్రిల్ 3: ఆదివారం సాధారణ సెలవు
గమనిక: బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఆన్లైన్ సదుపాయాలు.. ఆర్టీజీఎస్, నెఫ్ట్ సహా ఐఎంపీఎస్, యూపీఐ సదుపాయాలు 24×7 అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు కూడా పని చేస్తాయి. కాబట్టి బ్యాంక్‌లో ఏదైనా తప్పనిసరి పని ఉంటే తప్పా.. సెలవుల వల్ల సాధారణ వినియోగదారులకు ఎలాంటి ప్రభావం ఉండదు.
Plan your Banking activities well in advance
26/3/22 Saturday holiday. 27/3/22 – Sunday
28/3/22 – Strike
29/3/22 – Strike
30/3/22 – Working Day
31/3/22 – Working Day
01/4/22 – Annual Closing
02/4/22 – Saturday
03/4/22 – Sunday
So plan your banking accordingly.— Bhabish Thakur (@BhabishThakur) March 23, 2022