దేశంలో ఎంత అభివృద్ది చెందినా.. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలు సరైన రవాణా వసతులు లేక కష్టాలు పడుతూనే ఉన్నారు. ఓట్ల ముందు నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. తీరా గెల్చిన తర్వాత అటు ముఖం చూడరని బాధితులు తమ బాధ వ్యక్తపరుస్తున్నారు.
దేశానికి స్వాతంత్రం ఏళ్లు దాటుతున్నా.. పేదలకు కన్నీటికష్టాలు తీరడం లేదు.. ఇప్పటికీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు, నీటి వసతి లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చే నేతలు గెలిచిన తర్వాత మళ్లీ ఐదేళ్ల వరకు తమను పట్టించుకునే నాథుడు ఉండరని గిరిజనులు, మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు ప్రతిసారి అంటున్న మాటలే. తాజాగా ఓ గిరిజన ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలు పెన్షన్ కోసం ప్రతిసారి ఎన్నో అవస్థలు పడుతుంది.. ఆమె కోసం భర్త, కొడుకు ఒక కర్రని కావిడ చేసి చేశారు.. పళ్లెంలాంటి గిన్నెలో ముడుచుకొని ఉన్న ఆ మహిళను చూసి అక్కడ ఉన్నవాళ్ల హృదయాలు చలించిపోయాయి. ఈ ఘటన ఝార్ఖంఢ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
దేశంలో ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో నివసించేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు వాహన సదుపాయాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. ఝార్ఖండ్ లోని లతేహార్లో ఓ హృదయవిదారక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గిరిజన కుటుంబానికి చెందిన ఓ దివ్యాంగురాలికి పట్టణంలోని బ్యాంక్ కి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమె భర్త, కుమారుడు ఒక కర్రను కావడిగా చేసుకొని ఆ మహిళను మోసుకుంటా రావాల్సి వస్తుంది. లతేహార్ జిల్లాలోని మహుదంద్ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు.. గ్రామస్థులకు ఏదైనా పని ఉంటే కాలి నడకన రావాల్సిందే. ఇదే గ్రామానికి చెందిన లాలో కోర్బా అనే మహిళకు ప్రభుత్వ పెన్షన్ మంజూరు అయ్యింది.
ప్రభుత్వ పెన్షన్ మంజూరైన సంతోషం కాన్నా.. అది తెచ్చుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు పడే అవస్త అంతా ఇంతా కాదు. పెన్షన్ తీసుకోవాడానికి ఆమె భర్త దేవా, కొడుకు సుందర్లాల్ ఒక కావడి కట్టి అందులో చిన్న చేసిన్ ఏర్పాటు చేసి అందులో ఆమెను కూర్చొబెట్టుకొని కిలో మీటర్లు ప్రయాణించి బ్యాంక్ కి చేరుకున్నారు. కానీ వీరితో విధ మరోలా ఆడుకుంది.. తీరా బ్యాంక్ కి వచ్చిన తర్వా త సర్వర్లు పనిచేయడం లేదు… దాంతో లాలోకు పింఛన్ అందలేదు. దిక్కుతోచని స్థితిలో తిరిగి కిలో మీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు, ఫోటోలు వైరల్ కావడంతో.. బ్యాంక్ అధికారులు స్పందించారు. దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చేందుకు త్వరలో మార్గదర్శకాలు జాచే చేస్తామని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.