బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో పరంగా ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇంట్లోని సభ్యులు టైటిల్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ అనేది ఒక మనిషి క్లిష్ట పరిస్థితుల్లో, అనుకూలంగా లేని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాడు అని చూపించడం. అలాంటి షోలో కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడే వ్యక్తుల చీకటి కోణాలు కూడా వెలుగులోకి రావచ్చు. అలాంటి ఘటన గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిందు మాధవి– యాంకర్ శివ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. షో ప్రారంభానికి ముందు వాళ్లిద్దరూ కలిసిన అవకాశం, దాఖలాలు కూడా లేవు. హౌస్ లోకి వచ్చాక మాత్రం ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు.
ఇదీ చదవండి: ఒరేయ్- ఒసేయ్ అని తిట్టుకుని.. ఇప్పుడు కలిసిపోయిన బిందు-అఖిల్
అలాగే సీజన్ మొదలైనప్పటి నుంచి అఖిల్- బిందు మాధవికి అస్సలు పడట్లేదు. కానీ, తాజాగా ఓ టాస్కులో మాత్రం కలిసి ఆడారు. ఆ కాసేపటికే ఇద్దరూ కలిసిపోయినట్లు ప్రేక్షకులు ఫీలైపోయారు. కానీ, కొద్దిసేపటికే అదంతా టాస్క్ వరకే అని ప్రూవ్ య్యింది. అఖిల్– అజయ్- అషు– నటరాజ్ మాస్టర్ ఒకే మంచం మీద కూర్చుని బిందు- శివ గురించి గలీజ్ కామెంట్స్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఖిల్.. శివ- బిందు హీరో, హీరోయిన్ అంటూ చెప్పగా అందుకు వాళ్లు టైటిల్స్ పెట్టడం మొదలు పెట్టారు. అజయ్ మరీ నీఛంగా దుప్పట్లో దడదడ అని, గోడకేసి గుద్దుడు అంటూ నోరు పారేసుకున్నాడు.అషురెడ్డి అయితే ముసుగులో గుద్దులాట అంటూ రిపీట్ చేసింది. ఇంక నటరాజ్ మాస్టర్ చెప్పిన మాటలకు బిగ్ బాస్ బీప్ వేసుకున్నారు. అంటే ఎంత పెద్ద మాట అన్నాడో తెలియదు మరి. ఇవన్నీ పక్కన పెడితే అబ్బాయిలు ఒక అమ్మాయి గురించి కామెంట్ చేస్తుంటే వారించాల్సింది పోయి.. అషురెడ్డి కూడా వంతపాడి ముసుగులో గుద్దులాట అంటూ గలీజ్ టైటిల్స్ పెట్టడాన్ని సోషల్ మీడియాలో ఎండ గడుతున్నారు. కాస్త కూడా ఇంగితం ఉండక్కర్లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ల కామెంట్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాంకర్ శివ-బిందుపై అఖిల్-అజయ్-అషు-నటరాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thu🤮🤮#akhilsarthak : Shiva Bindu hero heroine#Ajay : Movie Title Duppatlo Dada dade,Goda ki esi guddude#AshuReddy :Musugulo Guddulaata
E #NatrajMaster antadu woman ante thalli tho samanam ani,idha nuvviche respect oka woman ki,u morons🤮#BinduMadhavi @DisneyPlusHSTel pic.twitter.com/VisBIhlU8G
— Vamc Krishna (@vamccrishnaa) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.