తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి అంతా ఇంతా కాదు. ఈ సీజన్ వచ్చిందంటే ప్రేక్షకులు టీవీలను అంటిపెట్టుకుని ఉంటారు. మొదట బిగ్ బాస్ షో కి జూనియర్ యన్టీఆర్, తర్వాత నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం కింగ్ నాగార్జున హూస్ట్ గా కొనసాగుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలోనూ వస్తుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన లోగో రిలీజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కు సిద్ధం అవుతుంది. ఈ షోకి సంబంధించిన లోగోను విడుదల చేస్తూ.. చిన్న వీడియో వదిలారు. మల్టిపుల్ కలర్స్ తో ఈ లోగోను డిజైన్ చేశారు. ‘త్వరలోనే బిగ్ బాస్ 6 మీ ముందుకు’ అంటూ ఈ వీడియో రిలీజ్ చేస్తూ.. #BBLiveOnHotstar అనే ట్యాగ్ ను జోడించింది. ఈ షోని కూడా 24 గంటల పాటు హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. లైవ్ రన్ చేస్తూనే టీవీలో గంట సేపు ఎపిసోడ్స్ ను ప్రసారం చేస్తారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ రానుంది.
ఈ సారి బిగ్ బాస్ సీజన్ కోసం 18 మంది కంటెస్టెంట్స్ ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సారి ప్రత్యేకత ఏంటంటే గతంలో ఇచ్చినట్లు ఈ సారి కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. ఇక ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు. యాంకర్లు, జబర్ధస్త్ టీమ్ నుంచి కూడా సెలబ్రెటీలు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో సత్తా చాటిన వారికి కూడా బిగ్ బాస్ 6 లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ నెల నుంచి ఈ షో మొదలవుతుందని టాక్ వినిపిస్తుంది. సెప్టెంబర్ నుంచి ఈ షో దాదాపు 100రోజుల పాటు రన్ కాబోతుందని అంటున్నారు. అలాగే షోకి వచ్చే క్రేజ్ ని బట్టి మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.