తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక తమిళ్ లో సినిమాలు చేసింది. తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ గా మారి ఇప్పుడు కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా స్ట్రాంగ్ అవుతానంటూ కామెంట్ కూడా చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిందు మాధవి బాగా బిజీ అయిపోయంది.
బిందు మాధవి.. హీరోయిన్ గా తెలుగులో మంచి కెరీర్ ని బిల్డ్ చేసుకోలేక పోయింది. కానీ, తమిళ్ మాత్రం మంచి అవకాశాలు దక్కించుకుని హీరోయిన్ గా ఎదిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె తన యాక్టింగ్ కెరీర్ కి చిన్న బ్రేక్ ఇచ్చింది. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ విన్నర్ అయిన తర్వాత బిందు మాధవి కెరీర్ మళ్లీ పట్టాలెక్కింది. తాజాగా ఆమెకు వెబ్ సిరీస్ ల ఆఫర్లు బాగా వస్తున్నాయి. ఇప్పటికే న్యూసెన్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ మే 12న ఆహాలో విడుదల కానుంది. ఈ సిరీస్ కి సంబంధించి యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో నటీనటులకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రెస్ మీట్ లో నవదీప్ కు కూడా చాలా వింత ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి అతను సమాధానం చెప్పాడు. యాంకర్ చాలా విషయాలను అడగ్గా.. నవదీప్ తనపై వచ్చిన డ్రంక్ అండ్ డ్రైమ్ ఇష్యూ మినహా.. అన్నీ అబద్ధాలే అంటూ ఆన్సర్ చెప్పాడు. అయితే ఇదే సమయంలో హీరోయిన్ బింధు మాధవికి కూడా ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేశారనే వార్తలు వచ్చాయి అవి నిజమేనా? అని ప్రశ్నించారు. అందుకు బిందు మాధవి సూటిగా సమాధానం చెప్పింది. అవి రూమర్స్ కాదని.. త్రిష మాజీ ప్రియుడు వరుణ్ మణియన్ తో తాను నిజంగానే డేటింగ్ లో ఉన్నానంటూ బిందు మాధవి అంగీకరిచింది.
“నేను నిజంగానే వరుణ్ మణియన్ తో డేటింగ్ లో ఉన్నాను. కాకపోతే అది వేరు వేరు సందర్భాల్లో జరిగింది. ఒకే సమయంలో మేము ఇద్దరం డేటింగ్ లో లేము. త్రిషతో బ్రేకప్ తర్వాత నాతే డేట్ చేశారు. నిజాన్ని ఒప్పుకోవాల్సిందే” అంటూ బిందు మాధవి సమాధానం చెప్పింది. నిజానికి ఒక హీరోయిన్ తన లవ్ ట్రాక్ గురించి ఇంత సూటిగా సమాధానం చెప్పడం చూసుండరు. బిగ్ బాస్ తర్వాత వెబ్ సిరీస్ ల అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. వీటి ద్వారా సినిమా అవకాశాలు కూడా రావాలని ఆమె కోరుకుంది. తెలుగులో అవకాశాలు రాక తాను తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిందని.. ఈసారి మాత్రం తెలుగులో స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.