అఖిల్ సార్థక్ 2014లో ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల 2016లో విడుదల అయ్యింది. అఖిల్ సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 రన్నర్ అప్‌గా నిలిచారు.
సినిమా వాళ్లు అన్న తర్వాత సోషల్ మీడియా అకౌంట్లను వాడటం పరిపాటి. ఫ్యాన్స్‌తో మమేకం కావటానికి చాలా మంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాను వాడుతూ ఉంటారు. తమకు సంబంధించిన విషయాలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ కూడా పెడుతూ ఉంటారు. తమ జీవితానికి సంబంధించిన సంతోషకర క్షణాలు, బాధతో గడిపిన రోజులు పంచుకుంటూ ఉంటారు. అయితే, నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ మాత్రం సోషల్ మీడియాకు కొద్దిరోజులు గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వాడటం ద్వారా తనకు సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉందని అన్నారు.
కొద్ది రోజులు ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. ఈ స్టోరీలో ఈ విధంగా ఉంది.. ‘‘ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటానికి నేను ఎప్పుడూ సంతోషంగా ఉన్నానంటూ స్టోరీలు పెట్టలేను. నేను సంతోషంగా లేను. నేను చాలా రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషంగా లేను. ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తున్నాను. నేను ఇకపై అలా చేయలేనని భావిస్తున్నాను. నేను నా రియాలిటీని చూపించడానికి ఇక్కడ ఉన్నాను. నాకు నా ప్రశాంతతే ఎక్కువ ముఖ్యం. నేను ఇకపై నా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయలేను.
కొన్ని బ్రాండ్స్‌ల కమిట్‌మెంట్లు ఉన్నాయి కాబట్టి.. వాటికి సంబంధించినవి నా టీం చూసుకుంటుంది. నేను కొన్ని రోజులు ఈ అబద్ధపు ప్రపంచం నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు. కాగా, అఖిల్ సార్థక్ 2014లో ‘బావ మరదలు’ అనే ఓ సినిమాలో నెగిటివ్ పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2016లో ఈ సినిమా విడుదల అయ్యింది. 2017లో మొదలైన ముత్యాల ముగ్గు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. టీవీ సిరీస్ ‘ఎవరో నువ్వు మోహిని’లో కూడా నటించారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. మరి, అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.