బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం ఫుల్ ఫైర్ మీదుంది. సోమవారం నామినేషన్స్ లో ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. దిష్టిబొమ్మలకు కుండలు పెట్టి వాటిని బేస్ బాస్ బ్యాట్‌తో బద్దలు కొట్టారు. మొత్తం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. దాదాపుగా ప్రతివారం అదే లిస్టు ఉంటాఉంటోంది. ఈసారి రాజ్, వాసంతి, శ్రీహాన్(కెప్టెన్) మాత్రం నామినేషన్స్ లో లేరు. ఇంక నామినేషన్స్ హీట్ పోయిందో లేదో.. తర్వాతి రోజు కెప్టెన్సీ పోటీదారుల టాస్కు మొదలైంది. ఇంకేముంది అంత కిందా మీద పడి తెగ కొట్టేసుకుంటున్నారు. ఇంటిని రెండు గ్రూపులుగా చేసి ‘మిషన్ ఇంపాజిబిల్’ టాస్క్ ఇచ్చారు. సామాన్యంగా బిగ్ బాస్ హౌస్ టాస్కుల్లో దాదాపుగా గొడవలు పడేందుకే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ కెప్టెన్సీ టాసుక్లోనూ అదే జరిగింది.
రెండు టీమ్‌లుగా విడిపోతారు.. ఒక టీమ్ ఇంకో టీమ్‌లోని సభ్యులను హత్య చేయాలి. అంటే నిజంగా కాదులెండి.. వాళ్ల భుజాలకు నాలుగు స్ట్రిప్స్ ఉంటాయి. వాటిని లాగేసుకో కలిగితే ఆ వ్యక్తి చనిపోయినట్లు. తర్వాత అతను దెయ్యం అవుతారు. అయితే ఈ టాస్కులో భుజ బలం మాత్రమే కాదు.. బుద్ధి బలం కూడా చూపించండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకేముంది ఫిజికల్ టాస్కులివ్వండి గుద్ది పడేస్తానంటూ చెప్పి చతికిలపడిన గీతూ తన బుద్ధికి పదును పెట్టింది. బాలాదిత్య వీక్‌నెస్‌తో ఆడుకునేందుకు గీతూ-శ్రీసత్య-శ్రీహాన్ స్కెచ్ వేశారు. బాలాదిత్య సిగిరెట్లు దాచేసి అతని వీక్‌నెస్ మీద దెబ్బకొట్టారు. బాలాదిత్య బయట లేనిసమయంలో అతని సిగిరెట్లు, లైటర్ తీసి దాచేశారు. గీతూ లైటర్‌ని టీషర్ట్ లో దాచుకుంది.
బయటకు వచ్చి నా లైటర్ ఇవ్వండి అంటూ బాలాదిత్య అడుగుతుంటే మాకేం తెలియదు అన్నట్లు కూర్చున్నారు. తర్వాత దారుణంగా రెండు స్ట్రిప్పులు ఇస్తే లైటర్ ఇస్తాను, ఇంకో రెండు స్ట్రిప్పులిస్తే సిగిరెట్ ఇస్తానంటూ గీతూ రాయల్ ఆఫర్ ఇచ్చింది. ఆఫ్ర్టాల్ సిగిరెట్ కోసం ఇంతలా దిగజారతావా అంటూ బాలాదిత్య చెబుతూనే ఉన్నాడు. చాలా చీప్‌గా బిహేవ్ చేస్తున్నావ్ అంటే.. “అవును నేను చీప్ దాన్నే.. థాంక్యూ సోమచ్” అంటూ గీతూ రిప్లై ఇచ్చింది. నువ్వు చేసేది తప్పు గూతూ అంటూ రేవంత్ చెబుతుంటే.. గీతూ- శ్రీసత్య ఇద్దరూ ఏది రాంగ్ అంటూ తిరిగి ప్రశ్నించారు. వీళ్ల ఆట చూసి చివరికి బాలాదిత్య ఏడ్చేశాడు. “పిచ్చోడిలా నమ్మాను.. దాన్ని నమ్మొద్దు అని అందరూ చెబుతున్నా బంగారం అని మాట్లాడాను. కానీ, నా ఎమోషన్స్ తో ఆడుకుంటోంది” అంటూ బాలాదిత్య కన్నీటి పర్యంతం అయ్యాడు.
అయితే అసలు ముందు లైటర్ దాచిపెట్టండి అంటూ గొప్ప సలహా ఇచ్చిన శ్రీహాన్ ఈ విషయంతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా పక్కకు వెళ్లిపోయాడు. తర్వాత బాలాదిత్య ఏడుస్తుంటే.. అతడిని ఓదార్చుతున్నాడు. నిజంగా శ్రీహాన్ ఎంత తెలివిగా తప్పుకున్నాడో అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. అయితే గీతూ రాయల్- శ్రీసత్య మాత్రం ఎంతో దారుణంగా అలాగే ఉన్నారు. ఇంక గీతూ.. బాలాదిత్య వీక్‌నెస్ ఆడుకోవడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా బిగ్ బాస్ ఒకటి చెప్తే.. బాలాదిత్యకు మరోటి చెప్పింది. అలా అతను వారంపాటు సిగిరెట్ తాగకుండా చేసింది. మైండ్ గేమ్ ఆడమని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడో లేదో.. వీక్‌నెస్ ల మీద దెబ్బకొట్టడం స్టార్ట్ చేసింది. అయితే ప్రేక్షకులు మాత్రం బాలాదిత్యకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.