గీతూ రాయల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతూ ఓ సినిమా థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన వీడియో అది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
గీతూ రాయల్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. టిక్‌టాక్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఈమె ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు టీవీ ఛానళ్లలో షోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. మరో వైపు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఇంతకీ సంగతేంటంటే.. గీతూ రాయల్ తాజాగా ఆరెంజ్ సినిమా రీ రిలీజ్‌కు వెళ్లారు. థియేటర్‌లో సినిమా చూశారు. ఈ సందర్భంగా కొన్ని పాటలకు ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ‘‘ సినిమా హాల్లో ఏంటా రచ్చ.. మిగిలిన వాళ్లు సినిమా చూడాలా వద్దా’’..‘‘ సినిమా చూడ్డానికి కాదు.. వీడియో తీసుకోవటానికి వెళ్లినట్లు ఉంది’’ అంటున్నారు.
మరి కొంతమంది ‘‘ అక్కా నువ్వు చాలా గ్రేట్.. సినిమా చూడ్డం వేరు.. సినిమాను ఎంజాయ్ చేస్తూ చూడ్డం వేరు’’.. ‘‘గీతూ అక్కతో అట్టా ఉంటది మరి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గీతూ ‘దేశ ముదరు’ రీ రిలీజ్‌కు కూడా వెళ్లారు. అక్కడ కూడా రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ‘‘ మల్టీప్లెక్స్‌ను మాస్ థియేటర్ చేశాం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ’’ అని పేర్కొన్నారు. మరి, సినిమా థియేటర్‌లో గీతూ ఇలా రచ్చ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.