బిగ్ బాస్ స్టార్స్ చితక్కొట్టేస్తున్నారు. మాస్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్.. ఇలా ఏ ఒక్క జానర్ తీసుకున్నా సరే ఫెర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టేస్తున్నారు. వీళ్ల స్టెప్పులు చూస్తుంటే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు. అలా అని వీళ్లు ఏదో చాలా కష్టమైన స్టెప్స్ వేస్తున్నారా అంటే లేదు. చాలా సింపుల్ గా ఉండే మూమెంట్స్ ని అంతే క్యూట్ లేదా నాటుగా వేస్తున్నారు. టీవీ ఆడియెన్స్ కి ఎంటర్ టైన్ మెంట్ ఓ రేంజ్ లో అందిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో అయితే నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రియాలిటీ షోల్లో బాగా పాపులర్ అయిన ప్రోగ్రామ్ ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు ఆరు సీజన్లు జరగ్గా.. అందులో పాల్గొని చాలామంది పేరు తెచ్చుకున్నారు. ఏడాదిలో మూడన్నర నెలల పాటు సీజన్ ఉంటుంది. ఆ తర్వాత షోలో పాల్గొన్న వాళ్లతో ఎంటర్ టైన్ మెంట్ షోలు ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు కూడా అలానే బిగ్ బాస్ షోలో ఇప్పటివరకు పాల్గొన్న పలువురిని జోడీలుగా సెలెక్ట్ చేసి, ‘బీబీ జోడీ’ పేరుతో ఓ డ్యాన్స్ షో పెట్టారు. ప్రతి శని-ఆదివారాలు రాత్రి 9 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తున్నారు.
ఈసారి కొరియోగ్రాఫర్స్ ఛాలెంజ్ లో భాగంగా అర్జున్-వాసంతి, అవినాష్-అరియానా, సూర్య-ఫైమా జోడీలు మంచి ఫెర్ఫార్మెన్సులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీళ్లందరూ ఒకెత్తు.. శ్రీసత్య-మెహబూబ్ మాత్రం మరో రేంజ్ అన్నట్లు రెచ్చిపోయారు. ‘బాహుబలి’లో ‘మనోహరి’ పాటకు డ్యాన్స్ చేసిన ఈ జంట.. తమ మధ్య గాలి కూడా చొరబడకూడదు అనేంతలా అతుక్కుపోయారు. అలా కంపోజ్ చేసిన స్టెప్పులతో అదరగొట్టారు. శ్రీసత్య అయితే.. మెహబూబ్ ని హత్తుకుని, అతడిపై వాలి, అతడిని పట్టుకుని వేలాడుతూ ఉండే స్టెప్పులతో మతి పోగొట్టిందనే చెప్పాలి. మరి శ్రీసత్య-మెహబూబ్ రెచ్చిపోయి చేసి డ్యాన్స్ పై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.