తెలుగులో అమితైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటి వరకు 5 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని.. త్వరలో ఆరో సీజన్ ప్రారంభానికి సిద్ధం అవుతోంది. అయితే బిగ్‌బాస్ 5 మాత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనేది వాస్తవం. ఆ తర్వాత వచ్చిన బిగ్‌బాస్ ఓటీటీ కూడా ఆశించిన మేర ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేకపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ 6 పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సారి మెరుగైన టీఆర్పీ సాధించాలని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 4 నుంచి బిగ్‌బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక చివరి దశకు చేరుకుంది. ఇక రేపటి నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్‌ని హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్స్‌లో క్వారంటైన్‌కి పంపబోతున్నారట నిర్వాహాకులు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపబోతుండగా.. తాజాగా వారి పేర్లు బయటకు వచ్చాయి.
ఇలా రిలీజ్ అయిన లిస్ట్‌లో ఓ యాంకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారి.. యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. తాజాగా వాంటెడ్ పండుగాడు చిత్రం ద్వారా హీరోయిన్‌గా మారిన దీపికా పిల్లి. బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ లిస్ట్‌లో దీపికా పేరు ముందు వరుసలో ఉండగా.. చివరి నిమిషంలో ఆమె బిగ్‌బాస్ అవకాశం వదులుకున్నట్లు సమాచారం. అంతేకాక ఆమె ప్లేస్‌ను మరో యాంకర్ వర్షిణితో రీప్లేస్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారక సమాచారం లేదు.
ఇక వీరిద్దరి పాపులారిటీపరంగా చూస్తే.. యాంకర్ వర్షిణికి 1.8 మిలియన్ల మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే.. దీపిక పిల్లికి ఏకంగా 2.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిజానికి దీపిక పిల్లి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌గా వచ్చి ఉంటే మాత్రం ఆమె కచ్చితంగా టాప్ 5 లిస్ట్‌లో ఉండేది.. కారణం ఆమెకున్న ఫ్యాన్ బేస్. అయితే యాంకర్ వర్షిణికి దీపిక పిల్లి కంటే తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి నిజమే కానీ.. ఆమెకు బులితెరపై దీపిక కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.
పైగా వర్షిణికి సినిమాల్లో చేసిన అనుభవం ఉండటం వల్ల ఆమెకు మంచి పీఆర్ టీంతో పాటు ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. మరి నిజంగానే వర్షిణి బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇస్తుందా.. ఒకవేళ ఉంటే.. హౌస్‌లో ఎంతవరకూ రాణిస్తుందో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.