‘బిగ్ బాస్ 5 తెలుగు’ రోజు రోజుకు ఉత్కంఠగా సాగుతోంది. విశ్వ ఎలిమినేషన్ అవ్వడంతో హౌస్‌లో అందరూ బాధ పడ్డారు. అన్ని విధాలుగా బాగా పర్ఫామ్ చేసిన విశ్వ ఎలా ఎలిమినేట్ అవుతాడంటూ ఇంట్లోని సభ్యులే ప్రశ్నించడం చూశాం. మండే అనగానే హౌస్‌లో ఫన్ డే.. నామినేషన్స్‌లో వాళ్లు చెప్పే కారణాలు, చేసే ఆర్గుమెంట్స్ ఎంతో సరదాగా అనిపిస్తాయి చూసేవాళ్లకు. అందుకే హౌస్‌లో మండే అంటే ఫన్ డే. రోజులు గడుస్తున్న కొద్దీ హౌస్‌లో గ్రూపులు, వారి మధ్య బంధాలు బలపడుతున్నాయి. ప్రతి టాస్కును ఎంతో ఛాలెంజింగ్‌గా ఆడుతున్నారు. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం.
హౌస్‌లో లాస్ట్ వీక్ పది మంది నామినేషన్స్‌లో ఉంటే టాస్కు ద్వారా ఒకరు సేవ్ అయ్యారు. యానీ మాస్టర్ మానస్‌ను సేవ్ చేశారు. దాంతో 8 మంది నామినేషన్స్‌లో ఉండటం.. వారిలో విశ్వ ఎలిమినేట్ అవ్వడం తెలిసిన విషయమే. ఈ వారం నామినేషన్స్‌లో సన్నీ, సిరి హన్మంత్, మానస్, రవి, కాజల్ ఉన్నారు. సరిగ్గా గమనిస్తే ఈ ఐదుగురు దాదాపు ప్రతివారం నామినేషన్స్‌లో ఉండే వాళ్లే. కారణం ఏదైనా ఈ లిస్ట్ మాత్రం తప్పకుండా నామినేషన్స్‌లో ఉంటారు. మానస్, సన్నీలపై హౌస్‌లో చాలా మందికి బాగానే కోపం ఉంది. వాళ్లిద్దరు కావాలని అందరినీ టార్గెట్ చేసి వాదనలకు దిగుతున్న విషయం తెలిసిందే. యానీ మాస్టర్ కెప్టెన్ కాబట్టి నామినేషన్స్‌లో లేరు. లేదంటే యానీ మాస్టర్ పేరు కూడా నామినేషన్స్‌లోకి వస్తుంది. ఈసారి శ్రీరామ చంద్ర నామినేషన్స్‌లో లేకపోవడం ఒకింత ఆశ్చర్యమే అని చెప్పాలి. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.