తెలుగు బిగ్ బాస్ సీజన్-5 విన్నర్ వీజే సన్నీకి ప్రమాదం చోటు చేసుకుంది.ఓ సినిమా ప్రమోషన్ షూట్ లో పాల్గొన్న అతడికి బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
వీజే సన్నీ.. తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సన్నీ బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. తనదైన డేరింగ్ ప్రవర్తనతో బిగ్ బాస్ సీజన్ విన్నర్‌గా నిలిచిన సన్నీ, లక్షలాది మంది ప్రజలు హృదయాలను గెలుచుకున్నారు. ఆనాటి నుంచి అతడు వరుస సినిమాలతో బిజీ బిజీ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదిలావుంటేసన్నీ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనగా అతడికి ప్రమాదం చోటుచేసుకుంది. డమ్మీ బులెట్ తగలడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
వీజే సన్నీ, సప్తగిరి, షకలక శంకర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి నటీనటులుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘అన్ స్టాపబుల్’ అనే కామెడీ ఎంటెర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిససిందే. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్ర ప్రోమోను డైరెక్టర్ షూట్ చేస్తుండగా సన్నీకి ప్రమాదం జరిగింది. పోలీస్ గెటప్ లో ఉన్న సప్తగిరి రివాల్వర్ చూపిస్తూ 30 ఇయర్స్ పృథ్విని ‘అన్ స్టాపబుల్’ మూవీ రిలీజ్ ఎప్పుడని అడిగుతాడు. థర్టీ ఇయర్స్ పృథ్వి నాకేం తెలుసు.. అనని సమాధానం చెప్తాడు అదే సమయంలో సీన్ లోకి వచ్చిన సన్నీవైపు రివాల్వర్ ఎక్కుపెట్టి సప్తగిరి అతన్ని కూడా అదే ప్రశ్న అడుగుతాడు. ఈ క్రమంలో సప్తగిరి చేతిలో ఉన్న రివాల్వర్ పొరపాటున పేలింది. అంతే అందులో ఉన్న డమ్మీ బుల్లెట్ అతనివైపు దూసుకెళ్లింది. అది డమ్మీ బుల్లెట్ అయినప్పటికీ అతి సమీపం నుంచి తగలడంతో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారని సమాచారం. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
షూటింగ్ లో బిగ్ బాస్ సన్నీకి ప్రమాదం
బుల్లెట్ తగలడంతో ఆసుపత్రికి తరలింపు#vjsunny #UnstoppableEknath pic.twitter.com/CO3Vqtf3Kn— yenugula somasekhar (@yenugulasomase1) May 12, 2023