బిగ్ బాస్ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. వారిలో సిరి, శ్రీహాన్ చాలా స్పెషల్. ఎందుకంటే గత సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి.. ఫైనల్ వరకు వచ్చేసింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. రన్నరప్ గా నిలిచాడు. రూ.40 లక్షల సూట్ కేసు తీసుకుని, విన్నర్ అయ్యే సదావకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ అయిపోయి, రెండు వారాలకు పైనే అయిపోయింది. కానీ మరోసారి సిరి-శ్రీహాన్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసులతో పాపులర్ అయిన జోడీ శ్రీహాన్-సిరి. కొన్నాళ్లపాటు రిలేషన్ లో ఉండి, పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఓ బాబుని పెంచుకుంటున్నారు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ హౌసులోనూ శ్రీహాన్-సిరి తెగ సందడి చేశారు. రొమాన్స్ తోనూ రెచ్చిపోయారు! అయితే బిగ్ బాస్ గత సీజన్ లో సిరి, షన్నుతో కాస్త ఎక్కువ చనువుగా ఉండేసరికి సిరి-శ్రీహాన్ మధ్య గొడవలు జరిగాయని చాలా మాట్లాడుకున్నారు. కానీ వీళ్లిద్దరి మధ్య అలాంటివి ఏం లేదని తేలిపోయింది.
దానికి తోడు ఈ సీజన్ లో శ్రీహాన్ కంటెస్టెంట్ గా రావడం, అతడికి సిరి ఫుల్ గా సపోర్ట్ చేయడంతో మనోడు ఫైనల్ వరకు వచ్చేశాడు. రేవంత్ విజేతగా నిలవగా, శ్రీహాన్ రియల్ విన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు తన ప్రేయసి సిరి బర్త్ డే వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోల్ని వీడియోలు.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటోల్లో సిరి-శ్రీహాన్ గట్టిగా హగ్ చేసుకుని కనిపించారు. ఓ వీడియోని కూడా శ్రీహాన్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సిరి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి సిరి-శ్రీహాన్ హగ్ పోజుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.