బిగ్ బాస్ దివి ముద్దులతో రెచ్చిపోయింది. అవును మీరు విన్నది చూడబోయేది నిజమే. నటిగా చిన్న చిన్న పాత్రలు చేసిన ఈమె.. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన తర్వాత క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ ఓ పాత్రలో నటించిన దివి.. నటిగా తనని ఎష్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా కూడా ఓ వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అందులో సీన్స్ అయితే కాకరేపుతున్నాయి.
ఇక విషయానికొస్తే.. తెలుగులో ఒకప్పుడు సినిమాల ట్రెండ్ ఉండేది. ఇప్పుడది మూవీస్ తోపాటు వెబ్ సిరీసులకు మారిపోయింది. మన దగ్గర కూడా పలువురు దర్శకులు సిరీసులు తీస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో రిలీజైన సిరీస్ ‘ATM’. డబ్బులు దొంగిలించడం అనే స్టోరీతో తీసిన ఈ సిరీసులో ‘బిగ్ బాస్’ సన్నీ లీడ్ రోల్ లో యాక్ట్ చేశాడు. మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.
ఇకపోతే ఇదే సిరీసులు దివి కూడా ఓ పాత్ర చేసింది. కాకపోతే పెద్దగా సీన్స్ అయితే లేవు. కానీ ఉన్నదానిలో మాత్రం రెచ్చిపోయి మరీ నటించినట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ క్లిప్.. యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ సీన్ లో భాగంగా హాస్టల్ లో ఉండే దివిని చూడటానికి ఆమె బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అదే టైంకి వార్డెన్.. రెంట్ డబ్బుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అతడికి డబ్బులిచ్చేసిన బాయ్ ఫ్రెండ్.. దివికి లిప్ కిస్ ఇస్తాడు. అలా చాలాసేపు వీళ్లు ముద్దు పెట్టుకుంటూనే ఉంటారు. ఆ సీన్ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.