విజయవాడలోని పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న పురాతన ఆలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఇందులో కనకదుర్గ రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా ఆమె ప్రసిద్ధి. అందుకే కోర్కెలు తీరిన వెంటనే ఆమెకు కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు.
బెజవాడలో కొలువైన అమ్మవారు కనకదుర్గమ్మ. ఏపీలో అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా ఆమె ప్రసిద్ధి. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. దసరా ఉత్సవాలు, శ్రావణ మాసం, ఇతర పండుగల సమయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారితో పాటు క్షేత పాలకుడు ఆంజనేయ స్వామిని, మల్లేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు భక్తులు. ఇక్కడ అన్నవితరణతో పాటు పులిహోర ప్రసాదం చాలా ఫేమస్. అయితే ఆమెకు కోరితే..కోర్కెలు తీరుస్తుందని అనేక మంది మొక్కులు మొక్కుకుంటారు. కోర్కెలు తీరిన వెంటనే ఆమెకు భక్తులు పెద్ద యెత్తున మొక్కులు చెల్లించుకుంటారు. కొంత మంది భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తుంటారు.
ఇటీవల దుర్గమ్మకు సిరిసిల్లకు చెందిన ఓ భక్తుడు అగ్గిపెట్టెలో చీరను సమర్పించిన సంగతి విదితమే. తాజాగా హైదరాబాద్ ఏఏస్ రావు నగర్‌కు భక్తురాలు భారీ కానుకలు అమ్మవారికి సమర్పించారు. వెంకటసత్యవాణి అనే మహిళ, తన కుటుంబ సభ్యులతో కలిసి దేవతను సందర్శించి.. 133 గ్రాముల బంగారు ఆభరణాలు, 391 గ్రాముల వెండి పళ్లెం కానుకగా సమర్పించారు. బంగారు ఆభరణాల్లో 29 గ్రాముల పచ్చల నెక్లెస్, 104 గ్రాముల లక్ష్మీకాసుల హారం ఉంది. ఆలయ అధికారులు వారికి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందించారు వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం సత్యవాణి కుటుంబం వీటిని ఆలయ అధికారులకు సమర్పించారు.
వీటి విలువ రూ. 7.50 లక్షలని సత్యవాణి తెలియజేశారు. వీటన్నింటిని అమ్మవారి ఉత్సవాలలో ఉపయోగించాలని సత్యవాణి కుటుంబ సభ్యులు కోరారు. అలాగే ఇంకోవైపు అమ్మవారి దుర్గగుడిలో అన్నదాన కార్యక్రమానికి తమిళనాడులోని చెన్నైలోని ఇందిరానగర్ కు చెందిన భోగరం వెంకట మార్కండేయ శర్మ విరాళాన్ని అందించారు. రూ.5 లక్షల చెక్కునే విరాళంగా అక్కడున్న ఈవో భ్రమరాంబకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అదే సమయంలో అమ్మవారి దుర్గమ్మ చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందింపజేసారు.