జిల్లాల పర్యటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు తడబాటులో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది. బహిరంగ సభలో ప్రసంగించే సందర్భంలో తడబాటుకు గురయిన చంద్రబాబు.. టీడీపీలో ఉన్న నేతనే.. తెలుగుదేశం పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారంటూ అధికార పార్టీపై విమర్శలు చేశాడు. ఇది చూసిన వారు.. ఇదేంది బాబు.. టీడీపీలో ఉన్న వ్యక్తిని టీడీపీలోనే చేరమని బెదిరించడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు..
జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం చంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించారు. ఈ క్రమంలో నిడదవోలులో బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు.. అధికార పార్టీని విమర్శించబోయి.. చివరకు తానే నవ్వుల పాలయ్యాడు. ఈ సందర్భంగా చంద్రబాబు మాజీ మంత్రి నారాయణ గురించి మాట్లాడుతూ.. ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడని.. ఎన్నో కాలేజీలు స్థాపించి.. ఎందరో విద్యార్థులు ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక కాలేజీల్లో చేరేందుకు దారి చూపారని తెలిపాడు.
అలాంటి నారాయణని అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారని.. మెడపైన కత్తి పెట్టి వైసీపీలో చేరాలని బెదిరిస్తన్నారు అని చెప్పే క్రమంలో తడబాటుకు గురయిన చంద్రబాబు.. నారాయణ మెడ మీద కత్తి పెట్టి తెలుగు దేశం పార్టీలో చేరాలని.. బెదిరించారని వ్యాఖ్యానించాడు. కానీ నారాయణ మాత్రం ఆ బెదిరింపులకు భయపడలేదని.. కావాలంటే తాను రాజకీయాలైనా వదులుకుంటాను కానీ.. ఎక్కడకు రానని స్పష్టం చేశారని తెలిపాడు చంద్రబాబు. ప్రస్తతం చంద్రబాబు మాట్లాడిన వీడియోని వైరల్ చేస్తూ.. ఆల్రేడీ పార్టీలో ఉన్న వ్యక్తిని.. తిరిగి అదే పార్టీలో చేరమని బెదిరించడం ఏంటి బాబు.. ఏంటి బాబు.. అని కామెంట్స్ చేస్తున్నారు.
చేరితే తెలుగుదేశంలో చేరు లేకపోతే కేసులు పెడతాం.. అని నారాయణ మెడ మీద కత్తి పెట్టారు. #IdemKharmaraBabu pic.twitter.com/VbLffQvqpg
— YSR Congress Party (@YSRCParty) December 2, 2022