ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ‘అసని’ తుపాను ప్రభావంతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను కాస్త బలహీన పడినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది. మొదట మచిలీపట్నం వద్ద తీరందాటుతుంది అని భావించినా ఆ తర్వాత శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా దిశ మార్చుకుని నర్సాపురం వైపు తీరందాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సముద్రతీరానికి బంగారు వర్ణం కలిగిన రథం కొట్టుకువచ్చింది. దీంతో దాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, ఎం సున్నాపల్లి సముద్రతీరానికి ఒక రథం కొట్టుకువచ్చింది. బంగారు వర్ణం కలిగిన రథం అక్కడి ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఆ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. ఇక బంగారు రథం విషయం తెలియగానే స్థానికులు వీక్షించేందుకు భారీ సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. జనం ఎగబడుతుండటంతో దీనికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకి చేరుకొని రథాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక మయన్మార్ నుంచి కొట్టుకువచ్చినట్టుగా నిర్థారణకు వచ్చారు. ఈ విషయంపై స్థానిక సీఐ క్లారిటీ ఇచ్చారు. “ఇది బంగారు రథం కాదని.. బంగారు పూత పూశారని తెలిపారు. ఇది రథం కాదంని.. ఒకరకమైన పూజ మండపంమని వివరణ ఇచ్చారు. దానిపైనా ఉన్న అక్షరాల సహాయంతో మయన్మార్ దిగా గుర్తినట్లు తెలిపారు”. ఏదేమైనప్పటికీ ఒక దేశం నుంచి మరో దేశానికి కొట్టుకురావడం చర్చనీయాంశంగా మారింది. దీని గురుంచి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
ఇది కూడా చదవండి: Asani Cyclone: అసని తుపానులో మచిలీపట్నం తీరప్రాంతం అంటూ చెబుతున్న ఈ వీడియో ఎప్పటిదంటే!