స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియాకు బానిసలైపోయారు నూటికి 99 శాతం మంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ ద్వారా సరిహద్దులు దాటి స్నేహాలు చేస్తున్నారు. స్నేహమే కాదూ ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియాకు బానిసలైపోయారు నూటికి 99 శాతం మంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ ద్వారా సరిహద్దులు దాటి స్నేహాలు చేస్తున్నారు. స్నేహమే కాదూ ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు. ఆ తర్వాత వారి కోసం దేశం కాని దేశం వచ్చి ప్రేయసి/ప్రేమికుడిని కలుసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. పబ్జీతో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి, ప్రియుడి కోసం దొంగచాటుగా భారత్‌కు వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. అలాగే ఇన్ స్టాలో పరిచమైన జార్ఖండ్ వ్యక్తి కోసం ఆరేళ్ల కుమార్తెతో ఇండియా ఫ్లైట్ ఎక్కింది పోలండ్ మహిళ పోలాక్ బార్చరా. బంగ్లాదేశ్ మహిళ జూలీ కూడా ప్రేమికుడి కోసం యుపికి చేరింది. ఇప్పుడు మరో దేశానికి చెందిన యువతి.. భారతీయ యువకుడి కోసం తన దేశాన్ని విడిచిపెట్టింది.
ఫేస్ బుక్‌లో పరిచయమైన తెలుగు యువకుడి కోసం లంక నగరాన్ని వదిలేసి వచ్చింది విఘ్నేశ్వరి అనే యువతి. చిత్తూరు జిల్లాకు వి కోట మండలంలోని అరిమాకులపల్లెకు చెందిన లక్ష్మణ్, శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వీరిద్దరూ ఆరేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. అతడిని విడిచి వుండలేని విఘ్నేశ్వరి.. లక్ష్మణ్‌ను కలిసేందుకు వీసా తీసుకుని భారత్‌కు వచ్చింది. అతడి కోసం శ్రీలంక నుండి వచ్చిందని తెలుసుకున్న పెద్దలు.. వీరిద్దరికీ గుడిలో పెళ్లి చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. ఆమె వీసాను పోలీసులు పరిశీలించగా.. వచ్చే నెల 6వ తేదీతో గడువు ముగియనుండటంతో దేశం విడిచి వెళ్లాలని యువతికి నోటీసులు ఇచ్చారు.