తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న ఆ పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 400 రోజులు దాదాపు 100 నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. తండ్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచే ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించడానికి సమాయత్తం అయ్యారు.
హైదరాబాద్ లోని నివాసంలో తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుమిత్రులను కలిశారు. తల్లిదండ్రులు చంద్రబాబు- భువనేశ్వరి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత అత్తమామలు బాలకృష్ణ- వసుంధర కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య భువనేశ్వరి హారతిచ్చి లోకేష్ కు వీర తిలకం దిద్దారు. బాలకృష్ణ దగ్గరుండి కారు ఎక్కించారు. తర్వాత ఇంటి నుంచి లోకేష్ నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు. తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. అక్కడ తాతకు లోకేష్ నివాళులర్పించారు. నారా లోకేష్ రావడంతో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్టీఆర్ ఘాట్ మొత్తం కోలాహలం నెలకొంది.
ఈ పాదయాత్రలో యువత, మహిళలను కూడా భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న యువత అభిప్రాయాలేంటి? రాష్ట్ర అభివృద్ధి వారి ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? అనే విషయాలను తెలుసుకోవడం చేస్తామన్నారు. యువత ఇచ్చే సలహాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ పాదయాత్రలో అన్ని రంగాలకు సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు, సవాళ్ల గురించి అధ్యయనం చేస్తామన్నారు. ఇంక నారా లోకేష్ పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమయ్యి.. ఒడిశా సరహద్దులో ఉండే ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, రాబోయే ఎన్నికల్లో తమ విజయానికి ఇది పునాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Lokesh is the youngest in Telugu history to attempt a Padayatra. He takes the blessings of the family members as he is ready to start #YuvaGalam pic.twitter.com/DWNnmPTvPC
— MIRCHI9 (@Mirchi9) January 25, 2023