ఏపీలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. వాటిని మంత్రులు సమర్థంగా తిప్పికొట్టడం కూడా చూస్తున్నాం. తాజాగా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్‌కు ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం రాలేదంటూ ప్రచారాలు చేశారు. పక్క రాష్ట్రానికి ఆహ్వానం తెలిపి.. మనల్ని మాత్రం పక్కన పెట్టారంటూ ఓ వర్గం వాళ్లు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రచారాలు చేశారు. వాటిని ఏపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. నవంబర్ 25న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీఎం జగన్ కు పంపిన ఆహ్వానాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. “దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్ కి ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం రాలేదు కాబట్టే అక్కడికి వెళ్లలేదు అంటూ చెబుతున్నారు. పక్క రాష్ట్రం వాళ్లు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వెళ్లారు అంటూ ఒక లిస్ట్ ని ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి పేరు మీద వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని ప్రభుత్వం తరపున విడుదల చేశాం.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ చేయాలని నిర్ణయం తీసుకుని ప్రభుత్వం సన్నద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. అసలు దావోస్ లో పాల్గొంటున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారినే విశాఖకు తీసుకురావాలని తాపత్రయ పడుతున్నారు. ముఖ్యమంత్రి గారి ముఖం చూసి రావట్లేదు అంటున్నారు. ముఖ్యమంత్రి ముఖం చూసి వస్తారా? ఆయన చేస్తున్న పరిపాలన, పరిశ్రమల కు ఆయన అందిస్తున్న ప్రోత్సాహకాలు, అన్ని రంగాల్లో ఏపీ ముందుకెళ్తున్న తీరు, సీఎం తీసుకునే నిర్ణయాలు వంటి వాటిని చూసి ఎవరైనా రాష్ట్రానికి వస్తారు” అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
మేము దావోస్ కి వెళ్లడం కాదు..దావోస్ పెద్దలనే ఏపీ కి తీసుకొస్తున్నాం – ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
FULL VIDEO – https://t.co/FQvmqF8xZy#GudivadaAmarnath #CMYSJagan #WEF2023 #WorldEconomicForum #YSRCP #Davos23 #Zurich #Switzerland #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/ZlWob75yzB
— NTV Telugu (@NtvTeluguLive) January 17, 2023