మాజీ మంత్రి కొడాలి నాని గురించి.. విపక్షంపై ఆయన చేసే వ్యాఖ్యల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ అంటే తనకు ఎంత అభిమానామో చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు. పదవులతో సంబంధం లేకుండా.. జగన్‌ని అభిమానించే కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. 2019లో MLA గా గెలిచిన తర్వాత జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో.. పలువురు పాత మంత్రులకు పదవి దక్కినా.. కొడాలి నానికి మాత్రం రెండో సారి పదవి దక్కలేదు. మంత్రివర్గ విస్తరణకు ముందే దీనిపై నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మంత్రి పదవి లేకపోతే.. తాను ఫ్రీ బర్డ్ అని.. ఇక విపక్షానికి చుక్కలే అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: మంత్రి పదవి రాని వారు ఏడుపులు,శోకాలు పెట్టొద్దు: కొడాలి నాని!
ఇక కేబినెట్ విస్తరణ తర్వాత కొడాలి నాని సైలెంట్ అయ్యారు. మీడియా ముందుకు కూడా పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుతం కొడాలి నానికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అది చూసిన జనాలు నానికి ఏమైంది అని ఆలోచిస్తున్నారు. ఇంతకు ఈ ఫోటోలో ఏం ఉంది అంటే.. మాజీ మంత్రి కొడాలి నాని గోశాలలో పడుకుని ఉన్నారు. ఈ ఫోటో చూస్తే.. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: మంత్రి పదవి పోతే నా విశ్వరూపం చూస్తారు: కొడాలి నానిమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి మళ్లీ స్థానం దక్కుతుందని చాలా మంది భావించారు. చంద్రబాబు మీద మాటలతో విరుచుకుపడటంలో కొడాలి ముందుంటారు. అటువంటి వ్యక్తికి మరోసారి మంత్రి పదవి ఖాయమని అందరు అనుకున్నారు. కానీ సీఎం జగన్ అందరి అంచనాలు తల్లక్రిందులు చేశారు. తనదైన శైలిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టి అందరికి షాక్ ఇచ్చారు జగన్.
ఇది కూడా చదవండి: ఆడుకుంటూ అడవికి చేరి.. 36 గంటలపాటు ఒంటరిగా గడిపిన చిన్నారి!
కానీ కొడాలిపై సీఎం జగన్ కు ఉన్న అభిమానంతో కేబినెట్ హోదా కలిగిన ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, దానికి ఛైర్మన్ చేస్తానని జగన్ చెప్పారు. కానీ దాన్ని కొడాలి తిరస్కరించారు. ఈ క్రమంలో మంత్రి పదవి పోయాక కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నట్లుగా తెలస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఇలా గోశాలలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.