డెబ్యూ టెస్టులోనే అదరగొట్టిన శ్రేయాస్‌ అయ్యర్‌..

Shreyas Iyer Debut test Century - Suman TV

‘న్యూజిలాండ్ టూర్‌ ఆఫ్‌ ఇండియా 2021’లో భాగంగా జరుగుతున్న కాన్పూర్‌ టెస్టులో టీమిండియా తడబడుతూ, నిలదొక్కుకుంటూ ఆడుతోంది. బ్యాట్సమన్లు కాస్త తడబడుతున్నా.. శ్రేయాస్‌ అయ్యర్‌ మాత్రం ఎంతో నిలకడగా ఆటను కొనసాగించాడు. తన తొలి టెస్టులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు.

171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు శ్రేయాస్‌ అయ్యర్‌. 75 ఓవర్‌ నైట్‌ స్కోర్‌ తో రెండోరోజు ఆట ప్రారంభించిన అయ్యర్‌ అదే జోరు కొనసాగించాడు. అదర్‌ ఎండ్‌ లో జడేజా, తర్వాత వచ్చిన సాహా ఔట్‌ అవ్వగా.. కాసేపు గేమ్‌ ను నిలబెట్టగలిగాడు. శ్రేయాస్‌ సెంచరీతో డెబ్యూ మ్యాచ్‌ లలో సెంచరీ చేసిన 16వ టీమిండియా ప్లేయర్‌ గా అయ్యర్‌ రికార్డుల కెక్కాడు. న్యూజిలాండ్‌ డెబ్యూ మ్యాచ్‌ లో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా అయ్యర్‌ రికార్డు నమోదు చేశాడు.