కాన్పూర్‌ టెస్టులో పాకిస్తాన్‌ కు టీమిండియా అభిమానులు ఝలక్‌!

Team india fans

‘న్యూజిలాండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా 2021’లో టీ20 సిరీస్‌ ముగిసి.. టెస్టు సిరీస్‌ మొదలైంది. కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్టులో పాకిస్తాన్‌ కు వ్యతిరేకంగా ప్రేక్షకులు చేసిన నినాదాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ మ్యాచ్‌ మొదలైన అరగంటకే అభిమానులు టీమిండియా ప్లేయర్లను ఛీర్‌ చేయడం మొదలు పెట్టారు. ‘జీతేగా జీతేగా ఇండియా జీతేగా’ ‘భారత్‌ మాతాకీ జై’ అని కొందరు, మరికొందరు వందేమాతరం అంటూ టీమిండియా ప్లేయర్లలో ఉత్సాహం నింపుతున్నారు.

Team india fans పాకిస్తాన్‌ ముర్దాబాద్‌..

ఈ నినాదాలు చేసే క్రమంలో పాకిస్తాన్‌ కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి ‘పాకిస్తాన్‌ ముర్దాబాద్‌’ అనగానే అతనికి సపోర్ట్‌ గా ఇంకొందరు ‘ముర్దాబాద్.. ముర్దాబాద్‌’ అంటూ కోరస్‌ ఇచ్చారు. అంటే పాకిస్తాన్‌ ఎంతో ప్రమాదకారి అనే ఉద్దేశంతో వారు ఈ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. మొదటి ఈ విషయం అర్థంకాని న్యూజిలాండ్‌ ప్లేయర్లు.. ఆ తర్వాత వారు కూడా నవ్వుకున్నారు. ఇటీవల సెప్టెంబర్‌ 17న మ్యాచ్‌ ప్రారంభానికి అరగంట ముందు న్యూజిలాండ్‌.. పాకిస్తాన్‌ తో సిరీస్‌ రద్దు చేసుకుని హుటాహుటిన వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ కూడా తాము టూర్‌ కు రాబోవడం లేదని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. వారిద్దరూ చెప్పింది భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని. ఇప్పుడు ప్రేక్షకులు చేసిన నినాదాలు కూడా వాటిని రిప్రెసెంట్‌ చేసేవిగా ఉండటంతో న్యూజిలాండ్‌ ప్రేయర్లు కూడా నవ్వుకుని ఉండచ్చని కామెంట్‌ చేస్తున్నారు. ప్రేక్షకులు పాకిస్తాన్‌ గురించి చేసిన నినాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.