టీ20 వరల్డ్‌ కప్‌ ముంగిట భారత్‌ కు భారీ షాక్‌.. రోహిత్‌ ఆడటం కష్టమేనా?

rohit sharma indian

ఐపీఎల్‌ 2021’ ముంబయి ఇండియన్స్‌ మొదట తడబడ్డా.. ఇప్పుడు పుంజుకుంటోంది. ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. అయితే ఈసారి వారి అదృష్టం కోల్‌కతా చేతిలో కూడా ఉంది. వచ్చే మ్యాచ్‌లో ముంబయి గెలిచి.. కోల్‌కతా ఓడిపోతే ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. ముంబయి ఇండియన్స్‌కి ఇది కొత్తేం కాదు. ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చి గతంలోనూ కప్పు కొట్టిన చరిత్ర వారికి ఉంది. ఈసారి కాకపోతే వారి అదృష్టం కోల్‌కతా చేతిలో ఉండేసరికి అభిమానులు ఇప్పుడు కోల్‌కతా ఓడిపోవాలని కోరుకోవడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌ సహా టీమిండియాకి కూడా గట్టి షాక్‌ తగిలేలా కనిపిస్తోంది.

షార్జా వేదికగా రాజస్థాన్‌పై ముంబయి ఇండియన్స్‌ సునాయాసంగా గెలిచారు. ఈ సీజన్‌కే అత్యల్ప స్కోరు నమోదు చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ దానిని కాపాడుకోలేకపోయింది. ముంబయి బౌలర్ల ధాటికి రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో కేవలం 90 పరుగులే చేయగలిగింది. 8 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ విజయలక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విజయంతో ఇంకా ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్నారు ముంబయి ఇండియన్స్‌. ఈ మ్యాచ్‌లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు భారత్‌ అభిమానులను కలవర పెడుతోంది.

ఇదీ చదవండి: ఐదేళ్లలో 75 మందితో పెళ్లి, 200 మంది యువతులని ట్రాప్.. వీడు మనిషి కాదు!

రోహిత్‌కు గాయం

రాజస్థాన్‌ బ్యాటింగ్‌ సమయంలో 15వ ఓవర్‌లో బంతిని ఆపేందుకు రోహిత్‌ డైవ్‌ చేశాడు. ఆ క్రమంలో రోహిత్‌ శర్మకు గాయం అయ్యింది. వెంటనే ముంబయి ఇండియన్స్‌ ఫిజియో చికిత్స చేసినా.. కాసేపటికే రోహిత్‌ శర్మ మైదానాన్ని వీడాడు. ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌లో రోహిత్‌ శర్మ గాయపడటం ఇది రెండోసారి. ఇటీవలి మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తర్వాత వచ్చి బ్యాటింగ్‌ చేసినా పెద్దగా ఆకట్టుకోలేదు. 13 బంతుల్లో కేవలం 22 పరుగులే చేశాడు.

rohit sharma mumbai jersyమాథ్యూ హేడెన్‌ అనుమానం

రోహిత్‌ శర్మకు తగిలిన గాయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ, రోహిత్‌ శర్మ మైదానాన్ని వీడుతున్న సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ రోరిత్‌ శర్మ గాయంపై స్పందించాడు. రోహిత్‌ శర్మ గాయం చూస్తుంటే రానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. హేడెన్‌ అనుమానమే నిజయమయితే భారత్‌కు భారీ షాక్‌ తగిలినట్టే. టీ20 వరల్డ్‌ కప్‌కు పెద్ద సమయం లేకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు అందరూ హేడెన్‌ మాట నిజం కాకూడదని కోరుకుంటున్నారు. రోహిత్‌ శర్మ అంత సీరియస్‌ గాయం అయిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.