ఐదేళ్లలో 75 మందితో పెళ్లి, 200 మంది యువతులని ట్రాప్.. వీడు మనిషి కాదు!

నేషనల్ క్రైం ఇటీవల దేశంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నేరాలు మాత్రం ఆగడం లేదు. మొన్నా మధ్య మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటకువచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మునిర్ ఇప్పటి వరకు మొత్తం 75 మందిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

బంగ్లాదేశ్ కు చెందిన ఈ మునీర్ సుమారు 200 మంది యువతులను భారత్ లోకి అక్రమ రవాణ చేసినట్లు పోలీసులు చెప్పారు. యువతుల పేదరికాన్ని, వారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని, వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపినట్లు మునీర్ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ వాసి అయిన మునీర్, భారత్ లోకి అక్రమంగా రావడం, తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్తుండేవాడు. ఈజీగా వచ్చే డబ్బుకు అలవాటు పడిన మునీర్, అమాయక మహిళలను, యువతులను టార్గెట్ చేశాడు. వారిని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించడం ఆరంభించాడు. అలా వచ్చిన మనీతో విపరీతంగా ఎంజాయ్ చేసేవాడు.

Muneer 1

బంగ్లాదేశ్ కు చెందిన పేదింటి యువతులు, మహిళలకు వల వేసి, వారికి భారత్ లోని ప్రముఖ నగరాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు మునీర్. ఈ క్రమంలో కాస్త అందంగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. వివాహం తరువాత వారిని తనతో తీసుకెళ్లే వాడు. కొన్నాళ్లు కాపురం చేసి, వారిని వ్యభిచారంలోకి దింపేవాడు. ఇలా గత ఐదేళ్లలో ఏమొత్తం 75 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు మునీర్. బంగ్లాదేశ్ నుంచి వారందరిని కోల్ కతాకు తీసుకువచ్చి, బ్యూటీపార్లర్ లో అందంగా తయారు చేయించేవాడు.

ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, స్టైల్ గా బట్టలు వేసుకుని ఎలా ఉండాలి అని తను పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇంకేముంది వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దించేవాడు. సమాజంలో పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు వెళ్లే హైటెక్ వ్యభిచార కేంద్రాల నిర్వాహాకులకు భారీ మొత్తానికి వారిని విక్రయించేవాడు మునీర్. ఈ క్రమంలో 11 నెలల క్రితం ఇండోర్ పోలీసులు విజయనగర్ ఏరియాలోని ఓ వేశ్యాగృహంపై దాడి నిర్వహించగా, అక్కడ ఏకంగా 21 మంది బంగ్లాదేశ్ మహిళలు చిక్కారు. వారి విచారిస్తే మునీర్ వ్యవహారం మొత్తం బట్టబయలైంది.

అక్కడ దొరికిన 21 మందిలో 12 మంది మునిర్ ను పెళ్లి చేసుకున్న వారే ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. బంగ్లాదేశ్ మహిళను వివాహం చేసుకున్న మునిర్ ఆమెను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సూరత్ పోలీసులకు దొరికిపోయాడు. జగత్ కిలాడీ మునిర్ ఇప్పటి వరకు మొత్తం 75 మందిని పెళ్లాడటంతో పాటు 200 మంది మహిళలను వ్యభిచార కేంద్రాలకు విక్రయించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు.