కుప్పంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ…

chandra babu

కుప్పం మున్సిపాలిటీ ఫలితాల్లో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే కుప్పంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ.. తాజాగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. చంద్రబాబుకు ఏమాత్రం తగ్గకుండా అధికార పార్టీ వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. మొత్తం 24 వార్డులకు గాను ఇప్పటి వరకు 14 వార్డులో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరికొన్ని వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ప్రతిపక్ష తెదేపా ఇప్పటి వరకు రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే కుప్పం మున్సిపాలిటీనీ  వైఎస్సార్‌సీపీ  కైవశం చేసుకున్నట్లు అర్థమవుతుంది. అయితే హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.