కుప్పంలో ఓటమితో చంద్రబాబు అసెంబ్లీకి కూడా రాలేదు: సీఎం జగన్

jagan assembly

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వైకాపా మహిళా ఎమ్మెల్యేలు అందరూ చర్చలో పాల్గొన్నారు. మహిళా సాధికారతపై సీఎం జగన్‌ మాట్లాడారు. అంతకన్నా ముందు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు లేకపోవడంపై సీఎం జగన్‌ తనదైనశైలిలో సెటైర్లు వేశారు. చర్చలో మాట్లాడేందుకు ముందు చంద్రాబాబు గురించి ప్రస్తావించారు.

“మహిళా సాధికారతపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు కూడా ఉంటే బావుండేది. అచ్చెంనాయుడు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌ కు వచ్చినప్పుడు చంద్రబాబు వస్తారనే చెప్పారు. అందుకే కాసేపు డిలే కూడా చేశాం. ఎంత డిలే చేసినా ఆయన రాలేదు. అచ్చెన్నాయుడు కూడా వస్తారనే అనుకున్నారు. మా వాళ్లు ఏం అంటున్నారంటే బహుశా కుప్పం ఎఫెక్ట్‌ ఏమో అని అంటున్నారు” అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం వల్లే చంద్రబాబు అసెంబ్లీకి రాలేదంటూ జగన్‌ అభిప్రాయపడ్డారు. చంద్రబాబుపై సీఎం జగన్‌ వేసిన సెటైర్లపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.