ఈ ఏనుగు వంటిల్లు పైనే దాడి చేస్తుంది!..

కయెంగ్​ క్రాచన్ నేషనల్​ పార్క్​లో ఉండే ‘బూన్​చుయే’ అనే మగ ఏనుగు, తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్​గా ప్రవర్తించలేదని పార్క్​ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్​గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు. వాసన పసిగట్టి ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి గదిలో ఉన్న తిండిని లాగించేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

Elephant In Thailand.jpg02థాయ్​లాండ్​లో చలెర్మ్​కియాపట్టణా గ్రామంలో అర్ధరాత్రి దాటాక పై ఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ ఆ ఇంటి యజమాని రాచధవన్ వంటగదిలో గజరాజు నిర్వాకం చూసి షాక్​ తింది. ఆ వెంటనే ఆ ఘటనను వీడియో తీసింది. కిచెన్​ గోడను అమాంతం పలగొట్టేసిన ఆ గజరాజు తొండాన్ని అక్కడున్న ర్యాకుల్లోకి పోనిచ్చి చిరు తిండ్లను తీసుకుంది. బస్తా బియ్యాన్ని అమాంతం మింగేసింది.

నష్టం లక్ష రూపాయల దాకా ఉందని అధికారులు అంచనా వేశారు. నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ లభించడం రాచధవన్ కి కాస్త ఊరట.