సమాజంలో వివాహేతర సంబంధాలు కలవరపెడుతున్నాయి. సజావుగా సాగుతున్న కాపురాల్లో అక్రమ సంబంధాలు చోటుచేసుకుని దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ భర్త తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి రగిలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పచ్చని సంసారాల్లో చిచ్చురేగుతోంది. ఎన్నో ఆశలతో వైవాహికబంధంలోకి అడుగుపెట్టిన దంపతులు వివిధ కారణాలతో గొడవపడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన అంశాలు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలకు దారితీస్తుంది. ఇదిలా ఉంటే భార్తభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆదిపత్యధోరణి చూపించడంతో మనసు విరిగి మరొకరితో వివాహేతర సంబంధానికి తెరలేపుతున్నారు. ఈ క్రమంలో కక్షలు పెంచుకుని హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. ఇదే విధంగా తన భార్య ఓ వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందని తెలిసి రగిలిపోయిన భర్త ఆమె ప్రియుడిని అంతమొందించాడు.
పెళ్లి బంధంతో ఒక్కటై అన్యోన్యంగా జీవించాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాల్లో చిక్కుకుని సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. పెళ్లైన తర్వాత దంపతుల మధ్య తలెత్తిన గొడవలతో వారు మరో ప్రియుడు, ప్రియురాలితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ఓ భర్త, అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్య ప్రియుడిని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి అతడిపై దాడిచేశాడు. గొంతు కోసి రక్తం తాగాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని బట్లహళ్లి ప్రాంతానికి చెందిన విజయ్, మాలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో విజయ్ భార్య మోడెంపల్లికి చెందిన మారేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి ఊరంతా కోడై కూస్తుంది. ఇక ఈ విషయం భర్త విజయ్ కు తెలియడంతో కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా మారేష్ ను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా మారేష్ ను చింతామణి తాలూకా సిద్దేపల్లి క్రాస్ వద్దకు రప్పించాడు. అక్కడికి చేరుకోగానే విజయ్ మారేష్ పై దాడి చేసి గొంతు కోసి రక్తం తాగాడు. ఈ తతంగాన్ని అంతా తన ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు విజయ్. అటుగా వెళ్తున్న కొందరు గాయపడిన మారేష్ ను గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మారేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.