మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. ఎంతో బంగారు భవిష్యత్ ఉన్నారు.. అకస్మాత్తుగా కన్నుమూస్తుంటారు.
ఇటీవల మనిషి ప్రాణాలు ఎలా పోతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా మన కంటికి కానరాని లోకానికి వెళ్లిపోతున్నారు. హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇతర కారణాల వల్ల చనిపోతున్నారు. సామాన్యులే కాదు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు అనుకోని ప్రమాదాల్లో కన్నుమూస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మొసలి దాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకం రేపింది. ఈ విషాదం సంఘటన కోస్టారికాలోని కానస్ నదిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కోస్టారికన్ ఫుట్ బాల్ ప్లేయర్ జీసన్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(29) ముసలి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. వ్యాయామం చేస్తూ ఫిషింగ్ బ్రిడ్జ్ నుంచి ఓర్టీజ్ నదిలో దూకాడని.. ఆ నదిలో ముసళ్లు ఉంటాయని విషయం తెలిసి కూడా అల్బెర్టో లోపెజ్ ఓర్టి నీటిలో దూకాడని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అతను నీటిలో ఎందుకు దూకాడో తెలియదని.. దూకిన వెంటనే మొసళ్ల సమూహం వచ్చి అతన్ని లాక్కెళ్లి పోయాయని స్థానికులు అంటున్నారు. కోస్టారికా రాజధాని సాన్ జోసెక్ కి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నదిలో దూకగానే మొసళ్లు అతన్ని పట్టుకొని పోతున్న ఒక భయానక దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు అంటున్నారు.
అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ ప్రముఖ డిపోర్టివో రియో కానాస్ క్లబ్ లో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. కోస్టారికా కు చెందిన అసెన్సో లీగ్ లో అతను కనిపించాడు. సంబంధితన ఫేస్ బుక్ లో ఉన్న పోస్ట్ అధారంగా ఈ దుర్ఘటన జరిగినట్లు జట్టు నిర్ధారించింది. ఫుట్ బాల్ క్రీడలో ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న అల్బెర్టో లోపెజ్ ఓర్టజ్ మరణంతో జట్టు శోకసంద్రంలో మునిగిపోయినట్లు పేర్కొంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అతని శరీరాన్ని వెలికితీయడానికి స్థానిక యంత్రాంగం ప్రయత్నిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్ చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.