ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడ్డవారికి, మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఓ లాడ్జీ లోకి మంటలు వ్యాపించి ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలు అయ్యాయి. లాడ్జిలో బస చేస్తున్న వీరు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎలక్ట్రిక్ షోరూమ్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగానే వీరు మరణించారు. అయితే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, […]
ఏపీలో కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. పలు చోట్ల మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఈ భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొందరు మరణించారు. ఈ నేపథ్యంలో వరదలపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ […]
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బావిలో పడిన ఓ చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన 40మంది బావిలో పడిపోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 23 మందిని కాపాడారు. ఇటు రాత్రి 11 గంటల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న నలుగురు పోలీసులు కూడా అందులో పడ్డారని అక్కడి వారు చెప్పారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 50 అడుగుల లోతున్న ఆ బావిలో 20 అడుగుల మేర నీళ్లున్నాయని […]
ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందడంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో […]
కయెంగ్ క్రాచన్ నేషనల్ పార్క్‌లో ఉండే ‘బూన్చుయే’ అనే మగ ఏనుగు, తరచూ ఊరి మీదకు వస్తుంటుంది. అయితే అది ఇప్పటిదాకా వయొలెంట్‌గా ప్రవర్తించలేదని పార్క్ నిర్వాహకులు చెప్తున్నారు. సైలెంట్‌గా వెళ్లి తిండిని తీసుకుంటుందని, ఎవరైనా తరిమినా అక్కడే కూర్చుని మారం చేస్తుందని, జనాలు కూడా ఆ ఆసియా ఏనుగు పట్ల సానుభూతితోనే వ్యవహరిస్తారని చెప్తున్నారు. వాసన పసిగట్టి ఇళ్లలోకి దూరి కడుపు నిండా లాంగిచేస్తోంది. ఈమధ్య ఓ ఇంటి వంటగది గోడను బద్ధలు కొట్టి గదిలో […]