ఒకప్పుడు సరైన ధర లేక రోడ్లపై పారేసిన టమోటా రేటు ఇంతలా ఎందుకు పెరిగింది?

Tomato

నిన్న మొన్నటి వరకు పోటాపోటీగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదల తగ్గింది. పోనీలే ఇది కాస్త ఉపశమనం అనుకునే లోపు.. ఇప్పుడు సామాన్యుడి మీద టామోటా భారం వచ్చి పడింది. మొన్నటి వరకు కూడా సరైన ధర లేక రైతులు టమోటా పంటని రోడ్డుపై పారేసి వెళ్తూ ఉండేవారు. అలాంటి టామోటా ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటింది. ఇప్పుడు కేజీ టమోటా ధర అక్షరాలా రూ.100 పైనే. మరి.. ఒక్కసారిగా ఇంత రేటు ఎందుకు పెరిగింది? ఆ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1) మన దేశంలో టమోటా అత్యధికంగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ లో ఉంది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోనే అత్యంత పెద్ద టమోటా మార్కెట్ యార్డ్ ఉంది. ఇక్కడ రైతులు టమోటానే ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కానీ.., గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ వర్షాలు ఆగకుండా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమని వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో టమోటా ఉత్పత్తి ఆగిపోయింది. కానీ.., టమోటా లేకుండా వంట పూర్తి కాదు. దీంతో.. టమోటాకి డిమాండ్ పెరిగిపోయింది. టమోటా ధర రూ.100 దాటడానికి ఇదే ప్రధాన కారణం.

2) దేశంలో నిత్యవసర వస్తువు ధర ఒక్కసారిగా పెరిగిందంటే అందులో మనుషుల స్వార్ధం ఎంతో కొంత ఉంటుంది. టమోటా విషయంలో కూడా ఇదే జరిగింది. టమోటా ఉత్పత్తి ఆగిపోయిన తరువాత.. మధ్యలో పంటని హోల్డ్ చేసి పెట్టుకున్న మార్కెట్ దళార్లకు ఆశ పెరిగిపోయింది. ముందే మార్కెట్ లోకి వచ్చేసిన కొన్ని వేల క్వింటాల టమోటా ఉత్పత్తులను కూడా వీరు ధర పెంచేసి అమ్మడం మొదలు పెట్టారు. టమోటా రేటు 20 నుండి ఒక్కసారిగా 40, 60 చేరడంలో వీరి స్వార్ధమే ఎక్కువ. చివరికి వర్షాలు ఎక్కువ అయ్యి, వరదలు వచ్చాక నిజంగానే పంట తగ్గిపోయి ఆ రేటు కాస్త 100ని తాకేసింది.

3) కార్తీక మాసంలో కూరగాయలకి డిమాండ్ కాస్త ఎక్కువ ఉంటుంది. సరిగ్గా.. ఇలాంటి సమయంలోనే వర్షాలు ఎక్కువ కావడం, ట్రాన్స్ పోర్ట్ కి సైతం కొని దగ్గరల అవకాశం లేకపోవడంతో రేట్లు పెరిగిపోయాయి.

4) ఏపీలో ఏటా లక్షా 40 వేల ఎకరాల్లో 2.30 లక్షల టన్నుల టమాటా సాగు జరుగుతూ వస్తోంది. కానీ.., ఈ వర్షాల కారణంగా ఇప్పుడు పంట లేకపోవడమే కాదు, డ్యామేజ్ కూడా అధికంగా ఉంది.

5) ఎలాగో ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రైతులు మళ్ళీ పొలాల్లోకి దిగుతారు. మళ్ళీ.. డిమాండ్ కి తగ్గ టమోటా పండిస్తారు. కానీ.., దానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు మాత్రం టామోటా ధర కొండ దిగి రావడం కాస్త కష్టమే. చూశారు కదా? రైతు ఓ నెల రోజులు పంట పండించలేకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.