గుంటూరు జైలుకి రఘురామరాజు! ఖైదీ నంబర్ 3468!

ఏ ముహూర్తాన ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేశారో తెలియదు గాని.., అప్పటి నుండి ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఎలాంటి నోటీసులు, వారెంట్ చూపించకుండా.., స్పీకర్ అనుమతి లేకుండా, ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ.. రఘురామ వర్గీయులు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు. కానీ.., హైకోర్టు ఈ విషయంలో ఎక్కడా ప్రభుత్వవాన్ని ప్రశ్నించలేదు. ఇక రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటీషన్ ని కూడా హై కోర్ట్ కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో.. రఘురామని కస్టడీ తీసుకోవడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే పోలీసులు కొట్టారు.., ఇవిగో గాయాలు అంటూ చూపించి రఘురామ కృష్ణరాజు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఇక్కడే నర్సాపురం ఎంపీ ప్రభుత్వంపై పై చేయి సాధించినట్టే కనిపించాడు. ఎందుకంటే ఆయన కోసం కోర్టు ఒక మెడికల్ బెంచ్ ని ఏర్పటు చేసింది. ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స అయ్యాక, ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. కానీ.., ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. ప్రభుత్వ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పూర్తి అవ్వగానే రఘురామ కృష్ణరాజుని గుంటూరు జైలుకి తరలించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.kahidhi gaduజీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు.. సీల్డ్‌ కవర్‌లో మెడికల్‌ రిపోర్టును జిల్లా కోర్టుకు సమర్పించారు. ఈ ధైర్యంతోనే ఏపీ సిఐడి అధికారులు ఎంపీని జైలు కి తరలించినట్టు తెలుస్తోంది. కానీ.., రఘురామ మెడికల్‌ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గుంటూరు జిల్లా జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీనితో రఘురామరాజు భవితర్యం ఏమిటన్న చర్చ వినిపిస్తోంది. ఇక గుంటూరు జైలులో రఘురామరాజు కు ఖైదీ నంబర్ 3468 కేటాయించారు. గుంటూరు పాత జైలులో అధికారులు రఘురామరాజుకి ఒక ప్రత్యేక బ్యారక్ కేటాయించినట్టు తెలుస్తోంది. కానీ.., ఇదే సమయంలో ప్రభుత్వంపై కోర్ట్ ధిక్కారణ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ డాక్టర్స్ జిల్లా కోర్టుకి సమర్పించిన రిపోర్ట్ లో ఏముందో తెలియకుండానే ఆయన్ని జైలుకి ఎలా తరలిస్తారని రఘురామ తరుపు లాయర్స్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో.., ఈ కేసులో కోర్ట్ తరువాతి ప్రొసీడింగ్స్ లో ఏమి జరుగుతుందో అన్న చర్చ అందరిలోనూ మొదలైంది.